English | Telugu
Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!
Updated : Dec 9, 2025
బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు.
మొదటగా బాల్ ని డీమాన్ పట్టుకొని సుమన్ శెట్టికి లక్ష మనీ పాయింట్స్ ఇస్తాడు. దానికి హౌస్ మేట్స్ అందరు ఆమోదం చెప్తారు. రెండోసారి భరణి పట్టుకొని రెండు లక్షలు గల మనీ పాయింట్స్ ని తనూజకి ఇస్తాడు. దానికి హౌస్ మేట్స్ ఆమోదం చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ బాల్ పట్టుకొని ఇమ్మాన్యుయేల్ అతి ఎక్కువ మనీ పాయింట్స్ అయిన రెండు లక్షల యాభై వేలు ఇస్తాడు. అందుకు అందరు ఒప్పుకుంటారు.
ఇక మిగిలింది యాభై వేలు, లక్షా యాభై వేలు, జీరో ఉంటాయి.
ఇమ్మాన్యుయేల్ బాల్ పట్టుకొని సంజనకి లక్ష యాభై వేలు పాయింట్స్ ఇవ్వగా దానికి హౌస్ మేట్స్ ఎవరు ఒప్పుకోరు. ఆ తర్వాత సుమన్ బాల్ పట్టుకొని డీమాన్ కి లక్షా యాభై వేలు ఇస్తాడు. దానికి అందరు ఒప్పుకుంటారు. ఇక మిగిలింది జీరో, యాభై వేలు. సంజన బాల్ పట్టుకొని యాభై వేలు నాకు ఉంచుకొని జీరో భరణికి ఇస్తున్నానని అనగా.. ఒక్క ఇమ్మాన్యుయేల్ తప్ప దానికి ఎవరు ఒప్పుకోరు. ఆ తర్వాత అందరు హౌస్ మేట్స్ నిర్ణయం అడుగగా.. సుమన్, తనూజ ఇద్దరు భరణికి యాభై వేలు అని సపోర్ట్ చేస్తారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ ఇద్దరు సంజనకి యాభై వేలు అని సపోర్ట్ చేస్తారు. ఇద్దరికి ఈక్వల్ అవుతాయి. భరణికి యాభై వేలు పాయింట్స్ అని కళ్యాణ్ సపోర్ట్ చెయ్యడంతో భరణికి యాభై వేల పాయింట్స్ వస్తాయి. సంజనకి జీరో వస్తుంది. దాంతో సంజన ఏడుస్తుంది. నాకు ఎవరి సపోర్ట్ లేదు.. నేనొక ఎమోషనల్ ఫూల్ ని అని ఏడ్చేస్తుంది. జీరో పాయింట్స్ ఉండడంతో సంజన జైలుకి వెళ్తుంది.