English | Telugu
Podharillu: పొదరిల్లు సీరియల్ గ్రాంఢ్ లాంచ్.. మొదటి ఎపిసోడ్ ఎలా ఉందంటే!
Updated : Dec 9, 2025
స్టార్ట్ మా టీవీలో సరికొత్త కథతో 'పొదరిల్లు' అనే ధారావాహిక సోమవారం రోజున మొదలైంది. ఒక కుటుంబంలో అన్నాతమ్ముళ్లు, ఓ చెల్లి ఉంటారు. వారి మధ్యలో ఆస్తి తగాధాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయని ఈ సీరియల్ లో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. ఇంట్లో ఆడవాళ్లు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారనేది ఈ సీరియల్ లో ఎమోషనల్ గా సాగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ -01 లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.
బృందావనం అనేది ఇంటిపేరు.. ఆ ఇంటిపెద్ద నారాయణ. అతనికి నలుగురు మగపిల్లలు.. తన భార్య చనిపోతుంది. అతను తాగుబోతు అవుతాడు. ఇక ఇంటికి పెద్ద కొడుకు మాధవ. తన ముగ్గురు తమ్ముళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి మాధవ వచ్చి.. మేనత్త తాయారు తన కూతురు గాయత్రికి ఓనీల ఫంక్షన్ చేస్తున్నారని పిలిచింది.. వెళదాం నాన్న అంటాడు. లేదు మీ మేనత్త గురించి నాకు బాగా తెలుసు.. ఇప్పటివరకు మన గురించి పట్టించుకోలేదు.. అలాంటిది వచ్చిందంటే ఏదో ఉందని నారాయణ అంటాడు గాయత్రి కోసం అయినా వెళదాం నాన్న అని మాధవా అంటాడు. మరొకవైపు నారాయణ చెల్లి తాయారు తన కూతురు ఓనీల ఫంక్షన్ కోసం అప్పు తెమ్మని తన భర్తని పంపిస్తుంది. తను వట్టి చేతులతో ఇంటికి వస్తాడు. నువ్వు ఒక చేతకానీ వాడివి.. నాకు వాటాగా వచ్చిన ఆస్తులన్నీ నాకేశవని తాయారు తిడుతుంటే తాయారు ఇంకొక అన్నయ్య అక్కడే ఉండి మీరు గోడవ పడకండి ఇప్పుడు ఫంక్షన్ నేను చేస్తాను. ఆ నారాయణ గాడి ఇంటి స్థలం ఇప్పుడు కొట్లలో ఉంటుంది అది మనకి వాటా ఇవ్వమని అడుగుదామని అతను అనగానే సరే అని తాయారు అంటుంది.
ఫంక్షన్ కి నారాయణ తన పిల్లలని తీసుకొని వస్తాడు. అన్నయ్య అంటూ నారాయణని ప్రేమగా చూసుకుంటుంది. మరొకవైపు గాయత్రికి వాళ్ళ అమ్మ రింగ్ గిఫ్ట్ ఇస్తాడు మాధవ. ఆ తర్వాత డ్రింక్ చెయ్యడానికి నారాయణని తాయారు ఇంకా తన భర్త తీసుకొని వెళ్తారు. అక్కడ వాళ్ళ పెద్ద అన్నయ్య ఉంటాడు. వాడితో నేను కూర్చొనని నారాయణ అనగానే ఎంతైన మనము ముగ్గురం సొంత అన్నా చెల్లెళ్ళం అని తాయారు అంటుంది. ఇక నారాయణ తాగుతుండగా తాయారు డాకుమెంట్స్ తీసుకొని వచ్చి సంతకం పెట్టమని అంటుంది. నాకు తెలుసు.. మీరు ఇలా చేస్తారని.. మీ వాటాలు మీరు అమ్ముకొని నా వాటా అడుగుతున్నారా అని కోపంగా పిల్లల్ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత తాయారు కోర్ట్ లో కేసు వెయ్యడంతో నారాయణ ఉంటున్న ఇళ్ళు నా వాటాకి వచ్చిందని నిరూపించుకునే వరకు అది అమ్మడానికి గానీ అక్కడ కట్టడానికి వీలు లేదని కోర్ట్ తీర్పు చెప్తుంది. ఆ విషయం నారాయణ దగ్గరికి తాయారు వచ్చి చెప్తుంది. దాంతో ఇరు కుటుంబాలకి మధ్య గొడవ జరుగుతుంది.
నీ ఇంటికి ఏ ఆడపిల్ల కోడలిగా రాదంటూ నారాయణపై మట్టి కొట్టి పోతుంది తాయారు. కొన్ని సంవత్సరాల తర్వాత మాధవకి పెళ్లిచూపులని అందరికన్నా చిన్నోడు కన్నా.. అతన్ని రెడీ చేస్తూ ఉంటాడు. మరొకవైపు రెండో వాడు చక్రి పెళ్లి కావాలని తను డ్రైవ్ చేస్తున్న క్యాబ్ కార్ కి పెళ్లి కానీ ఆడవాళ్ళకి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని బోర్డు పెట్టుకుంటాడు. ఇక మరొకవైపు ఈ సీరియల్ హీరోయిన్ అయిన మహాలక్ష్మిది చాలా ధనవంతుల కుటుంబం. తన పేరెంట్స్ తనకి మంచి సంబంధం చూస్తుంటారు. మాధవకి తన మేనత్త తాయారు కూతురు గాయత్రి అంటే ఇష్టం.. వాళ్ళు ఎలా కలుస్తారో ట్విస్ట్.. అంతేకాకుండా చక్రి, మహాలక్ష్మి వీళ్ళు ఎలా కలుస్తారనేది మరొక ట్విస్ట్. మరి ఈ ట్విస్ట్ లన్నీ దర్శకుడు ఎలా కలుపుతాడో చూడాలి మరి.