English | Telugu
Karthika Deepam2 : కాంచనని ఒప్పించిన దీప.. మన పెళ్ళికి కారణం సంకల్పం!
Updated : Dec 9, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -535 లో......కిచెన్ లో అనసూయ, కాంచన మాట్లాడుకుంటారు. అప్పుడే దీప వచ్చి కాంచనతో మాట్లాడాలని అంటుంది. నేను ఎవరితో మాట్లాడనని చెప్పు అక్క అని కాంచన అంటుంది. మీరు మాట్లాకండి నేను మాట్లాడుతానని దీప అంటుంది. మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టినప్పడు మీరు నన్ను ఒప్పుకొని హ్యాపీగా చూసుకున్నారు.
శౌర్య నా కూతురు.. అయినా మీ మనవరాలిగా చూసుకున్నారు. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అంటే మీకు చాలా ప్రేమ.. మీకు ఎంత ప్రేమ ఉందో.. అంతకన్నా ఎక్కువ నాకు ప్రేమ ఉంది.. నా బిడ్డని మీ చేతుల్లో పెడతాను.. నా మాట నమ్మండి.. నేను ఆ ఇంటికి వెళ్ళాలి.. దానికి కారణం ఇప్పుడు నేను చెప్పలేనని దీప రిక్వెస్ట్ చెయ్యడంతో కాంచన ఇక తప్పక ఒప్పుకుంటుంది. మరొకవైపు శ్రీధర్ కాంచన ఫోటో చూస్తూ బాధపడతాడు. అప్పుడే కావేరి పాలు తీసుకొని వస్తుంది. ఏవండీ మిమ్మల్ని ఒక మాట అడగాలని అంటుంది. మీరు కాంచన అక్క దగ్గరికి వెళ్లిపోండి అంటుంది.. దానికి శ్రీధర్ షాక్ అవుతాడు.
మీరు కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. ఇక్కడ పక్కనున్నా నన్ను పట్టించుకోవడం లేదు.. అయితే హాల్లో ఉంటున్నారు.. లేదా పైన రూమ్ లో ఉంటున్నారని కావేరి అంటుంది. నాకు ఇద్దరు కావాలి కావేరి. స్వప్న నా కూతురే. కార్తీక్ నా కొడుకే అని శ్రీధర్ అంటాడు. మరొకవైపు థాంక్స్ అమ్మ దీపని అర్థం చేసుకున్నందుకు అని కార్తీక్ అంటాడు. అదే సమయంలో శౌర్య వస్తుంది. అమ్మ సారీ నీ బేబీకి నొప్పి అయ్యేలా చేసానని శౌర్య అంటుంది. బేబీకి కూడా సారీ చెప్తుంది శౌర్య. ఇకనుండి నానమ్మ గదిలో పడుకుంటానని శౌర్య అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప నిద్రపోయేటప్పుడు.. వాళ్ళ పెళ్లి ఏ సిచువేషన్ లో జరిగిందని చెప్తుంది. అదంతా సంకల్పం అంటూ కార్తీక్ తో దీప మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.