English | Telugu
అసలే చలికాలం..పరివారం షోలో రొమాంటిక్ జోడీల హగ్గుల జాతర..
Updated : Dec 9, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోని వింటర్ స్పెషల్ థీమ్ గా తీసుకురాబోతున్నారు. ఈ ఎపిసోడ్ లో కొత్తగా పెళ్ళైన జంట మహేష్ - సాండ్రా, ఏక్ నాథ్ - హారిక, బ్రహ్మముడి జోడి మానస్ - దీపికా, యాదమ్మ రాజు - స్టెల్లా, నువ్వుంటే నా జతగా సీరియల్ యాక్టర్స్ అర్జున్ కళ్యాణ్ - అనుమిత వచ్చారు. ఈ కూల్ వెదర్ లో మీ అందరికీ హాట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ఫేవరేట్ రొమాంటిక్ జోడీస్ రాబోతున్నారు అని చెప్పింది శ్రీముఖి. ఇక కొత్త జంట మహేష్ సాండ్రా జోడిని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. పూలేసి వాటి మీద సాండ్రాని నడిపించారు.
రీసెంట్ గా పెళ్ళైన జంట అంటూ స్టేజి మీద ఉన్న యాక్టర్స్ అంతా పూలు వేసి విష్ చేశారు. పెళ్ళైన వెంటనే వింటర్ వచ్చేసింది కదా అని శ్రీముఖి అనేసరికి సాండ్రా సిగ్గుపడి కళ్ళు మూసుకుంది. "ఆ వింటర్ లో ఎలా ఉంది అనీ" అంటూ శ్రీముఖి రాగం తీసేసరికి "చల్లగానే ఉంది" అంటూ మహేష్ ఆన్సర్ ఇచ్చాడు. "అంటే వింటర్ వస్తేనే రొమాంటిక్ గా చేయాలా" అంటూ ఏక్ నాధ్ అడిగేసరికి అందరూ గట్టిగా అరిచారు. వెంటనే హారికని రెండు చేతుల మీద ఎత్తుకుని ఎప్పుడైనా రొమాంటిక్కే మేము అన్నాడు.
"చలి పెడుతుంది ఇప్పుడు -16 డిగ్రీలు అంది అంటే జంటలంతా హగ్ చేసుకున్నారు. దీపికా రెండు చేతులు కట్టుకుంది దాంతో మానస్ వెరీ గుడ్ అన్నాడు. -20 డిగ్రీలు అని శ్రీముఖి అనేసరికి ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నారంతా. దీపికా వచ్చి మానస్ భుజం మీద వాలేసరికి ఓకే అన్నాడు. -30 డిగ్రీలు అని శ్రీముఖి మళ్ళీ అనేసరికి ఏక్ నాధ్ - హారిక ఇద్దరూ చీర చెంగు కప్పేసుకుని ఇంకా గట్టిగ హగ్ చేసుకునేసరికి అందరూ అరిచారు గట్టిగా. ఇక దీపికా ఐతే మానస్ వెనకాల పడింది. దాంతో అవినాష్ దీపికను హగ్ చేసుకున్నాడు.