'శక్తి', 'జంజీర్' సినిమాలపై తారక్, చరణ్ జోకులు
on Mar 16, 2022

దాదాపు అందరు స్టార్ హీరోల కెరీర్ లో దారుణమైన డిజాస్టర్స్ కూడా ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్స్ లో కూడా అలాంటి సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా తారక్ నటించిన 'శక్తి', చరణ్ నటించిన 'జంజీర్' సినిమాల ప్రస్తావన వస్తే.. హీరోలతో పాటు ఆ హీరోల ఫ్యాన్స్ కూడా ఇబ్బందిపడుతుంటారు. తాజాగా ఈ సినిమాల గురించి తారక్, చరణ్ ఒకరిపై ఒకరు జోకులేసుకోవడం ఆకట్టుకుంది.
తారక్, చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రముఖ హిందీ కమెడియన్ భువన్ బాయ్ ఆర్ఆర్ఆర్ టీమ్ తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా అతను శక్తి, జంజీర్ సినిమాల ప్రస్తావన తీసుకొచ్చి నవ్వించాడు.
ముందుగా తారక్ తో "శక్తి సినిమాలో మీరు చెప్పే డైలాగ్స్ అంటే ఇష్టం" అని భువన్ బాయ్ అనగానే.. తారక్ ఒక్కసారిగా షాకయ్యాడు. "శక్తినా!.. ఆ సినిమా ఒక్కటే గుర్తుందా?.. నేను నటించిన మిగతా సినిమాలు గుర్తులేవా లేదా అదొక్కటే చూసావా?.. ఆ సినిమా గురించి మర్చిపో" అంటూ నవ్వులు పూయించారు తారక్.
ఆ తర్వాత "చరణ్ మీరు జంజీర్ చేశారు కదా" అని భువన్ బాయ్ అనగానే.. తారక్ గట్టిగా నవ్వేశాడు. దీంతో చరణ్ "ఇందాక నీ సినిమా గురించి అడిగినప్పుడు నేను నవ్వలేదు" అనడంతో.. " అప్పుడు నేను నిన్ను చూడలేదు.. అయినా ఇప్పుడు అతను ప్రశ్న అడిగిన విధానానికి నవ్వొచ్చింది" అని తారక్ చెప్పాడు. ఆ తర్వాత భువన్ బాయ్ 'జంజీర్' సినిమాపై సెటైర్ వేశాడు. " జంజీర్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో చూశాను. అంత ప్రశాంతంగా ఎప్పుడూ ఏ సినిమా చూడలేదు.. ఎందుకంటే థియేటర్ అంతా ఖాళీగా ఉంది" అంటూ కామెంట్స్ చేశాడు. స్టార్ హీరోలు తమ ప్లాప్ సినిమాల మీద సెటైర్స్ వేస్తే సరదాగా తీసుకోవడం ఆకట్టుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



