English | Telugu
Illu illalu pillalu : శ్రీవల్లికి షాకిచ్చిన రామరాజు.. సాగర్ ని అల్లుడిగా ఒప్పుకుంటాడా!
Updated : Dec 9, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -336 లో.. ప్రేమని పోలీస్ డ్రెస్ లో చూసి ధీరజ్ ఫ్లాట్ అవుతాడు. అది చెప్పకుండా తనని చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావ్ రా అని ప్రేమ అంటుంది. ఇంత పొట్టి పోలీస్ అని ధీరజ్ అనగానే ప్రేమ అలుగుతుంది. దాంతో లేదు ప్రేమ నువ్వు డ్రెస్ లో బాగున్నావ్.. నీకు బాగా సెట్ అయిందని ధీరజ్ అనగానే.. ప్రేమ మురిసిపోతుంది.
ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు రామరాజు ఇంటికి వస్తారు. భాగ్యం, అందరికి స్వీట్ ఇస్తుంది. అన్నయ్య మీ దయవల్ల బిజినెస్ పెట్టాము కానీ వచ్చిన చిక్కల్లా ఒక్కటే అదేంటి అంటే మీరు శ్రీవల్లి ని జాబ్ చెయ్యమని చెప్పారట కానీ తన సర్టిఫికేట్లు పోయాయని భాగ్యం యాక్టింగ్ చేస్తుంది. దానికి ఎందుకు టెన్షన్ డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకోవచ్చు కదా అని నర్మద, ప్రేమ అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. మరొకవైపు నర్మద వాళ్ళ నాన్న దగ్గరికి సాగర్ వెళ్తాడు. నాకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ట్యాలెంట్ లేదు.. మీరు మీ కూతురికి భర్తగా నన్ను ఒప్పుకోవాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు.
దీనికి ఒక్కటే మార్గం.. నువ్వు చదివి జాబ్ కొట్టలేవు .. అందుకని జాబ్ ని కొనాలి. నేను ఇందులో ఇన్వాల్వ్ కానని సలహా మాత్రమే ఇస్తానని అతను అనగానే అందుకు ఎంత అవుతుందని సాగర్ అడుగుతాడు. పదిహేను నుండి ఇరవై లక్షలు అవొచ్చని అతను చెప్తాడు. మరొకవైపు రామరాజుకి ఎవరో ఫోన్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతారు. దాంతో అక్కడున్న శ్రీవల్లికి ఫోన్ ఇచ్చి.. నాకు అర్థం అవ్వడం లేదు మాట్లాడమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.