English | Telugu
షకీల దెబ్బకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాక్!
Updated : Sep 9, 2023
బిగ్ బాస్ సీజన్-7 సరికొత్తగా సాగుతుంది. మొన్నటి ఎపిసోడ్ లో శివాజీ బిపీ పేషెంట్ లా మారిపోగా అందరూ హడలెత్తిపోయారు. కాగా ఇప్పుడు షకీల గారి వంతు వచ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో ఎప్పుడు క్లోజ్ గా ఉండే రెండు మూడు బ్యాచ్ లు ఉన్నాయి.
పల్లవి ప్రశాంత్, రతిక ఒక జట్టుగా ఎప్పుడు కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు వారి మధ్యలోకి ప్రిన్స్ యావర్ వస్తున్నాడు. అయితే శుభశ్రీ తటస్థంగా ఉంటుంది. ఇక ప్రియాంక జైన్, అమర్ దీప్ ఒక జట్టుగా మ్యూచువల్ గా ఉంటూ వస్తున్నారు. ఆట సందీప్ ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక యాక్టర్ శివాజీ, కిరణ్ రాథోడ్, షకీల, దామిణి ఒక జట్టులాగా ఉంటున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు కలిసి జట్లలాగా ఫామ్ అయి హౌజ్ లో కాస్త గందరగోళంగా ఉంటున్నారు. టాస్క్ లు ఇచ్చినప్పుడు ఎవరికేం ఇచ్చారో అనే హై టెన్షన్ లో ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్.
అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో షకీల తన యాక్టింగ్ తో హౌజ్ లోని కంటెస్టెంట్స్ కి చెమటలు పట్టించింది. అయితే మొదట తనకి బాగోలేదని శివాజీ హైప్ క్రియేట్ చేశాడు. దాంతో హౌజ్ లో ఉన్న డాక్టర్ గౌతమ్ కృష్ణ.. షకీలకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటు చేయాల్సిన ప్రాథమిక చికిత్స చేశాడు. అయితే ఇక కూర్చోలేనని, ఓపిక లేదని షకీల అనడంతో అందరూ అలెర్ట్ అయ్యారు. తనని బెడ్ మీదకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. ఇక అదంత చూస్తూ శుభశ్రీ హడలెత్తిపోయింది. వెంటనే తన దగ్గర ఉన్న మైక్ లో.. షకీ అమ్మకి వెంటనే మెడిసిన్స్ పంపించండి బిగ్ బాస్ అంటూ రిక్వెస్ట్ చేసింది. ఇక షకీ అమ్మ దగ్గరి దాకా వెళ్ళిన దామిణి భయపడి వచ్చేసింది. ఆ తర్వాత కాసేపటికి టేస్టీ తేజ వెళ్లాడు. షకీ అమ్మకి కాళ్ళు నొక్కుతుండగా తను సడన్ గా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. దాంతో ఏం పర్లేదు, ఏం పర్లేదంటూ టేస్టీ తేజ తనకి సపోర్ట్ ఇచ్చాడు. ఇక హౌజ్ లోని ఆడవాళ్ళంతా షకీ అమ్మ దగ్గరికి వెళ్లి చూసి కంగారు పడ్డారు. అందరూ టెన్షన్ తో నిద్ర కూడా పోలేకపోయారు. ఇక ఇలా హౌజ్ లోని కంటెస్టెంట్స్ అంతా షకీల చేసిన పర్ఫామెన్స్ కి బిత్తెరపోయారు. అసలు విషయానికొస్తే.. శివాజీ ముందుగానే షకీల, కిరణ్ రాథోడ్ లతో డిస్కస్ చేస్తాడు. ఇలా చేద్దామని అనగా సరేనని షకీల గారు పర్ఫామెన్స్ స్టార్ట్ చేస్తారు. అలా శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో షకీల గారు వన్ ఉమెన్ షోగా నిలిచారు.