English | Telugu
ఆస్ట్రేలియాకి వెళ్ళేముందు వాళ్ళిద్దరు బోరున ఏడ్చేశారు!
Updated : Sep 9, 2023
తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇక్కడి కళాకారులని, సినిమా ఆర్టిస్టులని, టీవీ రంగంలో కడుపుబ్బా నవ్వించే కామెడియన్స్ ని విదేశాల్లో ఈవెంట్ పేరుతో భారీ పారితోషికాలిచ్చి పర్ఫామెన్స్ చేపిస్తారు. అయితే ఇప్పటికే అస్ట్రేలియాలో జరిగే ఒక ఈవెంట్ కి హైపర్ ఆది, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, ముక్కు అవినాష్.. ఇలా బుల్లితెరపై మెరిస్తున్న స్టార్ కమేడియన్స్ ఆస్ట్రేలియా చేరుకున్నారు.
కాగా మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఈవెంట్ కోసం మనవాళ్ళ హడావిడి మాములుగా లేదక్కడ. కాగా ఇక్కడినుండి ఒక్కో కళాకారుడు, కమేడియన్ వెళ్ళేప్పుడు గట్టిగానే ప్రిపేర్ అయినట్టున్నారు. అయితే నూకరాజు, ఏంజిల్ ఆసియా మాత్రం ఏడ్చేరంట. ఎందుకంటే ఈవెంట్ కోసం కొన్ని రోజులు ఒకరినొకరు మిస్ అవుతారనే ఉద్దేశంతో .. ఇద్దరు హగ్ చేసుకొని కాసేపు మాట్లాడుకొని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ' రాజు ఆస్ట్రేలియా వెళ్ళేముందు ఎందుకో ఇద్దరం ఏడ్చేశాము' అంటూ ఒక వ్లాగ్ తన యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది ఆసియా. ఇందులో నూకరాజు ఆస్ట్రేలియా వెళ్ళేముందు అసియా తన దగ్గరికి వెళ్ళి.. నాకోసం ఏం గిఫ్ట్ తెస్తావని అడుగగా, నేనే వస్తానని నూకరాజు సమాధనమిచ్చాడు. ఆ తర్వాత తనకోసం స్పెషల్ గిఫ్ట్ తెస్తానని చెప్పాడు. ఆస్ట్రేలియాకి వెళ్ళాక నన్ను మిస్ అవుతావా అని ఆసియా అడుగగా.. అవును మిస్ అవుతాను. అందుకే నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన షర్ట్ ని, నువ్వు ఇచ్చిన వాచ్ ని ఇలా అన్నీ నువ్విచ్చినవే తీసుకొని వెళ్తున్నానంటూ నూకరాజు చెప్పగా ఆసియా ఎమోషనల్ అయింది. కాగా ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్ లో ఈ సెండాఫ్ వీడియో ట్రెండింగ్ లో ఉంది.