English | Telugu
వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ముకుంద ప్రయత్నం.. డిస్టబ్ చేసిన అలేఖ్య!
Updated : Sep 9, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -257 లో.. నీ ప్రవర్తన మార్చుకో, ఎందుకు ఊహల్లో బతుకుతున్నావంటూ ముకుందకి రేవతి చెప్తుంది. నేను ఊహల్లో ఏం బ్రతకడం లేదు. ఊహని నిజం చేసుకునే పనిలో ఉన్నానని ముకుంద చెప్తుంది. మా నాన్న ఇక్కడికి వచ్చింది. నా ప్రేమ గురించి పెద్ద అత్తయ్యకి చెప్పడానికని ముకుంద అనగానే.. రేవతి టెన్షన్ పడుతుంది. ఎక్కడ భవానికి నిజం తెలుస్తుందోనని, ఎలాగైనా శ్రీనివాస్ గారు నిజం చెప్పకుండా ఆపాలని రేవతి అనుకుంటుంది.
మరొకవైపు అలేఖ్య అడిగిన తలతిక్క ప్రశ్నలకి మధు పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తాడు. అప్పుడే మధు దగ్గరకి కృష్ణ రావడంతో.. కృష్ణ, మధు ఇద్దరు కూడా తల తిక్క ప్రశ్నలు వేసుకుంటారు. మరొకవైపు శ్రీనివాస్ దగ్గరకి రేవతి వెళ్లి.. అన్నయ్య భవాని అక్కతో, ముకుంద ప్రేమించింది మురారీనే అని చెప్పకండని అనగానే.. నా కూతురు జీవితం చక్కపడాలంటే నేను చెప్పి తీరాలని శ్రీనివాస్ అంటాడు. మరొకవైపు మధు హాల్లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. కృష్ణ మధు దగ్గరకి వస్తుంది. రోజుకీ రెండు లీటర్ ల వాటర్ తాగాలని కృష్ణ చెప్తుంది. సరే కృష్ణ నువ్వు వెళ్లి తాగని మధు అనగానే.. కృష్ణ ఫ్రిడ్జ్ దగ్గరకి వెళ్లి వాటర్ తాగి ఫ్రిడ్జ్ లో ఉన్న వేరుశనగలని తీసుకొని తింటూ హాల్లోకీ వస్తుంది. అక్కడ టీ కప్ కనిపించగా ఒక్కో వేరుశెనగని, టీ కప్ లో వెయ్యడానికి ట్రై చేస్తుంది. ఈ సారి వేరుశెనగ టీ కప్ లో పడితే నా మీద ఉన్న ప్రేమని ఏసీపీ సర్ చెప్తాడని అనుకొని రెండు వేస్తుంది మూడవది వేస్తుంటే కప్ లో పడకుండా ముకుంద వచ్చి పట్టుకొని నోట్లో వేసుకుంటుంది. ఏంటి ముకుంద ఇలా చేసావ్? కావాలంటే ఇచ్చేద్దాన్ని కదా.. నేను ఒకటి అనుకొని వేస్తున్నా అని అనగానే.. ఏం అనుకున్నావని ముకుంద అడుగుతుంది. ఏసీపీ సర్ ప్రేమ విషయం నాకు చెప్తాడని అనుకొని వేస్తున్నానని కృష్ణ అనగానే.. అంటే మురారి ప్రేమిస్తున్నట్లు నీకు తెలుసా అని ముకుంద అడుగుతుంది. తెలుసు రేవతి అత్తయ్య చెప్పిందని కృష్ణ చెప్తుంది.
ఆ తర్వాత నువ్వు నీ లవ్ ని చెప్తే డైరెక్ట్ గానే చెప్తావ్ కదా? ఇలా మూడవ వ్యక్తి ఇన్వాల్వ్ ఉండొద్దు కదా? అలాగే మురారి లవ్ చేస్తే డైరెక్ట్ చెప్పేవాడు కదా అని ముకుంద చెప్తుంది. లేదు రేవతి అత్తయ్య నాకు ఒట్టేసి చెప్పిందని కృష్ణ అనగానే.. ఆవిడ అలాగే చెప్తుందని కృష్ణకి మురారి మధ్య దూరం పెరిగేలా చెయ్యడానికి ముకుంద ట్రై చేస్తుంటే అప్పుడే అలేఖ్య వచ్చి మురారి పైన ఉన్నాడని కృష్ణకి చెప్తుంది. దాంతో కృష్ణ పైకి వెళ్తుంది. ఆ తర్వాత కరెక్ట్ టైమ్ కీ వస్తావని ముకుంద అలేఖ్యపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
