English | Telugu
కన్నీళ్లు పెట్టుకున్న సత్య శ్రీ...ఒక్క పూట టాబ్లెట్ వేసుకోకపోయినా ....
Updated : Nov 3, 2025
కార్తీక పౌర్ణమి స్పెషల్ గా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఆడియన్స్ ని అలరించింది. ఇక ఇందులో శివుడికి క్షీరాభిషేకం చేశారు ఈ షోకి వచ్చిన లేడీస్ అలాగే నంది చెవిలో వారి కోరికలను కూడా చెప్పుకుని వాటిని తీర్చమని కోరుకున్నారు. "కోరికలు బయటకు చెప్పుకుంటే నెరవేరవు అనే నమ్మకం ఉంది. కానీ ఇక్కడ మీ కోరికలు చెప్పుకుంటే అవి నెరవేర్చడానికి మేము కూడా ఎంతో కొంత సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నంది చెవిలో కోరుకున్న కోరికలేంటో" విందాం అంటూ రష్మీ చెప్పడంతో అలా ఒక్కొక్కరు ఎంఎం కోరుకున్నారో తెలిసింది.
ముందుగా సత్యశ్రీ కోరికను ప్లే చేసి వినిపించారు. "శివయ్యా మా అమ్మ హెల్త్ అసలు బాలేదు. మా అమ్మ ఆరోగ్యం బాగవ్వాలి మునుపటిలా నవ్వుతూ ఉండేలా చేయవా ప్లీజ్..శివయ్యా ఆమె బాగుంటే మేము బాగుంటాం " అని కోరుకుంది. "ఏమయ్యింది అమ్మకు" అని ఇంద్రజ అడిగేసరికి "అమ్మకు హార్ట్ లో బ్లడ్ సర్క్యూలేషన్ అనేది లో. ఆమె ఒక్క పూట టాబ్లెట్ వేసుకోకపోయినా స్ట్రెస్ వచ్చి పెరలాసిస్ బారిన పడి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మేము ఆమెను ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. ఇప్పటి వరకు అమ్మ అసలు నార్మల్ గానే లేదు. మాట్లాడుతుంది కానీ మర్చిపోతుంది. ఎన్నో హాస్పిటల్స్ కి తిప్పాం. ఆమె అలా పడుకుని ఉంటుంది అంతే అసలు ఏంటో కూడా మాకు ఏమీ అర్ధం కావడం లేదు. మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉంటుందన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారు. వాటిని లైఫ్ లాంగ్ వాడాలి." అని చెప్పింది. దాంతో ఇంద్రజ "అంతా మంచి జరగాలి. అమ్మ కోలుకోవాలి అని ఇక్కడ అందరం కూడా ప్రే చేసుకుంటాం" అని భరోసా ఇచ్చింది. "ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. మేము ఎవరికీ చెప్పుకోలేదు. నాకంటూ నాకో ఫామిలీ ఉన్నారు అనే ధైర్యాన్ని ఇచ్చారు థాంక్యూ" అని చెప్పింది.