English | Telugu
కొంపల్లో దూరతాడు కానీ కంటెంట్ లో దూరడు...
Updated : Aug 22, 2024
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. అందులో రాఘవ బులెట్ భాస్కర్ మీద పంచులు వర్షం కురిపించాడు. శుక్రవారం, శనివారం టీమ్స్ మధ్య డబ్బులు పెట్టే విషయంలో రాఘవ వెర్సెస్ బులెట్ భాస్కర్ అన్న రేంజ్ కి వచ్చేసరికి మధ్యలో రష్మీ మీడియేటర్ గా వ్యవహరించింది. "ముందు మీరు భాస్కర్ కి చెప్పండి. ఆయన నాలుగు కొంపల్లో దూరతాడు కానీ కంటెంట్ లో దూరడు" అని ఘాటుగా కామెంట్ చేసేసరికి అందరూ నోరు నొక్కేసుకున్నారు. "ఐనా నీకెందుకవన్నీ పోన్లే పెద్దోడివి కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే ఇలా అంటున్నవ్.
మా ఆవిడ అంటోంది డబ్బులు పోయినందుకు బాధగా లేదు కానీ నీ చేతుల్లో పరువు పోగొట్టుకుంటున్నందుకు దొబ్బుతుంది ఇంట్లో" అని రివర్స్ లో ఘాటుగా రిప్లై ఇచ్చాడు భాస్కర్. తర్వాత భాస్కర్ ఫైమాని చేసుకునే చేసుకునే స్కిట్ భాస్కర్ కి నరేష్ తండ్రిలా నటించాడు. సరే పులిని కంటావో, పందిని కంటావో చూసుకో అని కామెంట్ చేశారు. అక్కడ కూడా భాస్కర్ పరువు పోయింది. ఈ వారం ఎపిసోడ్ లో టోటల్ గా కమెడియన్స్ అంతా కూడా బులెట్ భాస్కర్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక నెటిజన్స్ ఐతే కొంతమంది పాత టీమ్ లీడర్స్ తీసుకురావాలని అంటుంటే కొందరు మాత్రం కొత్త వాళ్ళను తీసుకురండి అని పోస్టులు పెడుతున్నారు.