English | Telugu
అషురెడ్డితో ఇంటర్వ్యూ.. పవన్‌ను లాగిన వర్మ!
Updated : Sep 7, 2021
రామ్ గోపాల్ వర్మకు పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. తాను తీసిన సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు, యూట్యూబ్ ఇంటర్వ్యూలను మార్కెట్ చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్కులు, జిమ్మిక్కులు ప్లే చేస్తారు. ఇప్పుడు అషురెడ్డి ఇంటర్వ్యూ ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ను ఫుల్లుగా వాడేసుకుంటున్నారు.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే అషురెడ్డికి పిచ్చి. ఆయనకువీరాభిమాని. పవన్ పేరును ఒంటిపై టాటూ వేయించుకుంది. ఈ టాపిక్ పట్టుకున్నారు వర్మ. పవన్ కల్యాణ్ పుట్టినరోజున అషురెడ్డి ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ రోజు సాయంత్రం ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్న సందర్భంగా మరోసారి పవన్‌ను మధ్యలోకి లాగారు.
"సత్యహరిచంద్రుడు, లార్డ్ బాలాజీ మీద ఒట్టు... అషురెడ్డి ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ టాపిక్ లేదు" అని వర్మ ట్వీట్ చేశారు. ఓట్లు వేసిన తర్వాత తీసి గట్టు మీద పెట్టానని చెప్పడం... మాట మీద నిలబడకపోవడం వర్మకు అలవాటే. పవన్ టాపిక్ తో పాటు అషురెడ్డి థైస్ షో ఇంటర్వ్యూలో హైలైట్ కానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలో అషురెడ్డి థైస్ మీద వర్మ ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు.