English | Telugu

మోనిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! ర‌త్న‌సీత‌లో పెరుగుతున్న భ‌యం!!

కార్తీక్ మీద మోజుతో మోనిత చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైందా? ఆమెను పోలీసులు పెట్టుకుంటారా? లేదంటే పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోవాల్సిన పరిస్థితి మోనితకు వస్తుందా? ఇవాళ్టి 'కార్తీక దీపం' (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ చూస్తే ఇటువంటి సందేహం కలుగక మానదు. మోనితకు మద్దతుగా నిలుస్తున్న రత్నసీత సైతం 'మేడమ్! లొంగిపోండి' అని అంటుందంటే... మోనిత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తన మెడలో తాళి కట్టకపోతే కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెడతానని కార్తీక్‌కి మోనిత వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగా కార్తీక్ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయిస్తుంది. మరోవైపు కార్తీక్‌కి కడుపునొప్పి వచ్చేలా చేసి ఆస్పత్రికి రప్పించుకుని డాక్టర్ టీనా పేరుతో మారువేషంలో అతడిని చూసి వెళుతోంది. మాట్లాడుతోంది. కట్టుకున్న భార్యకు తన పరిస్థితి చెప్పుకోలేక కార్తీక్ తనలో తాను ఆందోళ‌న ప‌డుతున్నాడు. మరోవైపు ఏసీపీ రోహిణితో 'మూగమ్మాయిగా టీ తీసుకొచ్చినది మోనిత' అని దీప చెప్పడంతో ఆ కోణంలో ఏసీపీ దర్యాప్తు మొదలుపెడుతుంది. ఇదీ జరిగిన కథ. మరి, ఈ రోజు ఏం జరిగింది? అనే విషయంలోకి వెళితే...

కార్తీక్‌కి మోనిత టీ ఇచ్చిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ కోసం ఏసీపీ రోహిణి వెతుకుతుంది. రత్నసీతతో "సీసీ టీవీ ఫుటేజ్ కనిపించడం లేదంటే దీప చెప్పినది నిజమేనా? మన స్టేషన్ లో ఎవరైనా మోనితకు హెల్ప్ చేస్తున్నారా?" అని అంటుంది. దాంతో రత్నసీతకు భయం మొదలైంది. మోనిత దగ్గరకు వెళ్లి రోహిణి మేడమ్‌కి డౌట్ వచ్చిందని, లొంగిపోమని చెబుతుంది. కానీ, మోనిత మాట వినదు. పైగా, 'కార్తీక్ తాళి కట్టిన తర్వాత లొంగిపోతా. నీకు నీ భర్త ఎంత ముఖ్యమో... నాకు కాబోయే భర్త అంతే ముఖ్యం' అని అంటుంది. మరోవైపు మోనితను పట్టుకోవాలని ఎటువంటి సాహసాలు చేయవద్దని దీపతో కార్తీక్ చెబుతాడు. రోహిణి బయటకు వెళుతూ... స్టేషన్ కి ఎవరు వచ్చి వెళుతున్నారో చూడమని పోలీసుకు చెబుతుంది.

'కార్తీక దీపం'లో తాజా పరిణామాలు చూస్తుంటే మోనిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు ఉంది. అయితే, 'మోనిత మరణించలేదు. బతికి ఉంది' అనే నిజం పోలీసులకు ఆధారాలతో దొరకాలి. సీసీ టీవీ ఫుటేజ్ కోణం నుండి దర్యాప్తు చేసినా... ఆస్పత్రి దగ్గర నిఘా పెంచినా... మోనిత దొరకడం ఖాయం. మోనిత దీపకు దొరికినట్టు ప్రోమో విడుదల చేసి సీరియల్ మీద మరింత ఆసక్తి పెంచారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.