English | Telugu
ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లోకి వచ్చిన యాంకర్ రవి!
Updated : Sep 7, 2021
'బిగ్ బాస్ 5' మొదలైంది. కర్టైన్ రైజర్ ఎపిసోడ్ తర్వాత తొలి రోజే హౌస్ హీట్ ఎక్కింది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు... ఒకరితో ఒకరు సరిగా కలవడం లేదనే నెపంతో కొందరు మిగతా సభ్యులను ఎలిమినేట్ చేయాల్సిందిగా నామినేట్ చెయ్యడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. ఈ సీజన్ ఎలా ఉండబోతుందనేది చెప్పడానికి ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ ఓ ఉదాహరణ అని చెప్పవచ్చు.
'బిగ్ బాస్' సీజన్ 5లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. దీన్ని వెరైటీగా, కాస్త చెత్తగా డిజైన్ చేశారు. చెత్త కవర్స్ మీద సభ్యుల ఫొటోలను అతికించారు. ఎవరైనా సరే ఫలానా సభ్యుడిని నామినేట్ చేయాలంటే... అతడి ఫొటో ఉన్న చెత్త కవర్ తీసుకుని చెత్త కుండీలో వేయాలి. ఎందుకు అతడిని నామినేట్ చేస్తున్నారనేది కూడా చెప్పాలి. మిగతా సభ్యులతో సరిగా కలవడం లేదనే కారణంతో ఎక్కువమంది మిగతా సభ్యులను నామినేట్ చేశారు.
వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ రౌండ్ లో సభ్యులందరూ మిగతా సభ్యుల చేత నామినేట్ చేయబడ్డారు. అయితే, ఎవరిని అయితే ముగ్గురు నామినేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిమినేషన్స్ లో ఉంటారని బిగ్ బాస్ కండిషన్ పెట్టడంతో చాలామంది సేవ్ అయ్యారు. ఆరుగురు మాత్రం బుక్ అయ్యారు. అందులో పాపులర్ ఫేస్ యాంకర్ రవి ఉండటం విశేషం.
యాంకర్ రవి, ఆర్జే కాజల్, యూట్యూబర్ సరయు, హీరోయిన్ హమీదా, యాక్టర్ మానస్ నాగులపల్లి, మోడల్ జెస్సీ ఫస్ట్ వీక్ నామినేట్ అయినా సభ్యుల్లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.