English | Telugu

సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్!

జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై ఆక‌ట్టుకున్న జోడీ సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్. బుల్లితెర‌పై ఈ జంట ఏ స్థాయిలో పాపుల‌ర్ అయ్యారో అంద‌రికి తెలిసిందే. సెల‌బ్రిటీల స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకుని బుల్లితెర‌పై హాట్ ఫేవ‌రేట్ గా మారిపోయారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి 'ఢీ', 'జ‌బ‌ర్ద‌స్త్‌', 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' వంటి షోల్లో చేసే హంగామా మామూలుగా వుండ‌దు. వీళ్లున్నారంటే ఆ షో సూప‌ర్ హిట్టే. ఇదే ఈ జంట ప్ర‌త్యేక‌త‌. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో స‌హ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ష్మీ గౌత‌మ్‌.. సుడిగాలి సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

"నేను లేన‌ప్పుడు చేసింది చాలు... నీ హ‌ద్దుల్లో మ‌ర్యాద‌గా వుండు" అంటూ సుధీర్‌కు ర‌ష్మీ వార్నింగ్ ఇవ్వ‌డంతో అక్క‌డే వున్న హైప‌ర్ ఆది షాక్ కు గుర‌య్యాడు. అయితే సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ మ‌ధ్య ఈ స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏంటీ?.. ఎందుకు సుధీర్‌కి వార్నింగ్ ఇచ్చింది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ‌ధ్య జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ నుంచి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ త‌ప్పుకున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌లకు త‌గ్గ‌ట్టే ర‌ష్మీ, సుడిగాలి సుధీర్ గ‌త కొన్ని ఎపిసోడ్ లుగా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ లో క‌నిపించ‌లేదు.

దీంతో వారి ఫ్యాన్స్ కొంత హ‌ర్ట్ అయ్యార‌ట‌. నెట్టింట ఇదే విష‌యాన్ని కొంత మంది కామెంట్ ల రూపంలో తెలియ‌జేశారు కూడా. సుధీర్‌, ర‌ష్మీ త‌మ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా రెమ్యున‌రేష‌న్ లు పెంచాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం వ‌ల్లే జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు వీరిని లైట్ తీసుకున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌చారంలో నిజం లేద‌ని నిరూపిస్తూ సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మ‌ళ్లీ హంగామా చేయ‌డం మొద‌లుపెట్టారు.

Also Read:లైవ్ లో ఏడ్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ హార్ట్ బ్రేక్!

ఈ సంద‌ర్భంగా `ఉప్పెన`లోని `జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు..` అంటూ సాగే పాట‌కు ర‌ష్మీ, సుధీర్ హంగామా చేశారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య చిన్న సంభాష‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగానే ర‌ష్మీ.. సుడిగాలి సుధీర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఉత్త‌దే అని కొట్టి పారేశారు. అంతే కాకుండా ఈ జోడీని `ఢీ14`కి తీసుకురావాల్సిందే అంటూ నిర్వాహ‌కుల‌కు రిక్వెస్ట్ లు పెడుతున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.