English | Telugu

మాన‌స్ హౌస్ లో చెప్పిందే చేశాడుగా!

బిగ్‌బాస్ సీజ‌న్ 5తో మాన‌స్ కు మంచి పేరొచ్చింది. మిగ‌తా కంటెస్టెంట్ ల‌కు పూర్తి భిన్నంగా కామ్ అండ్ సెటిల్డ్ .. మెచ్చూర్డ్ గా వ్య‌వ‌హ‌రించి మాన‌స్ అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు. టైటిల్ గెల‌వ‌లేక‌పోయినా టాప్ 5లో నిలిచి త‌న స‌త్తా చాటాడు. ఇక ప్రియాంక విష‌యంలో అత‌నిపై కొంత నెగ‌టివిటీ స్ప్రెడ్ అయింది. అయితే త‌న‌ని నొప్పించినా ఆమెని మెప్పించిన తీరు.. సున్నితంగానే ప్రియాంక‌ని హెచ్చ‌రించిన తీరు వీక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది.

ఇక హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన వారికి క్రేజ్ వుంటుంది కానీ దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటేనే వారి కెరీర్ ముందుకు సాగుతుంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే కొంతమంది స‌క్సెస్ అయితే మ‌రి కొంతమంది ఫెయిల్ అయిపోయారు. తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన కంటెస్టెంట్ ల‌లో అయితే కొంతమంది ఇప్ప‌టికే సినిమాల ఛాన్స్ లు కొట్టేశారు. ఇంకొంత‌ మంది ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రి కొంతమంది ఏది చేస్తే బాగుంటుంద‌ని ఇంకా ఆలోచిస్తూనే వున్నారు.

ఇదిలా వుంటే త‌ను హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లాక ఏం చేయ‌బోతున్నానో మాన‌స్ ముందే చెప్పేసిన విష‌యం తెలిసిందే. తాను ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని స్టార్ట్ చేస్తాన‌ని, కొత్త వారికి అవ‌కాశాలు ఇస్తూ కొత్త త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుడ‌తాన‌ని చెప్పాడు. చెప్పిన ప్ర‌కార‌మే సినిమా ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని మాన‌స్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

" width="400" height="700" layout="responsive">

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.