English | Telugu
దీపకు నిజం చెప్పేసిన కార్తీక్!
Updated : Jan 5, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో ఆసక్తికరమైన ట్విస్ట్ లతో సాగుతోంది. సిటీ వదిలేసిన దీప కుటుంబం తాటికొండ గ్రామంలో తలదాచుకుంటుంటుంది. ఇక్కడే వారికి రుద్రాణి రూపంలో మరో ప్రమాదం వెంటాడుతూ వేధిస్తూ వుంటుంది. దీప, కార్తీక్ లని టార్గెట్ చేసిన రుద్రాణి తనని కాదని, తనపై పోలీస్ కేసు పెట్టిన శ్రీవల్లి, కోటేషులని హత్య చేయిస్తుంది.
Also read:సిరి, షణ్ణు తెలిసే చేశారు.. మానస్ బయటపెట్టేశాడు!
అప్పటి నుంచి కార్తీక్ .. రుద్రాణి గురించి భయపడుతూ వుంటాడు. దీప ఇంటికి రాకపోవడంతో ఏమై వుంటుందా? అని ఆలోచిస్తూ రుద్రాణి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంటాడు. ఇదే సమయంలో బాబుకి జ్వరం వస్తుంది. ఆలస్యంగా గమనించిన కార్తీక్ ఏం చేయాలో తెలియక పిల్లాడి ఒళ్లు కాలిపోతుండటంతో తడి గుడ్డతో తుడుస్తుంటాడు. ఈ లోగా దీప వచ్చేస్తుంది. రాగానే "ఏంటీ దీపా ఇంత ఆలస్యమా.. ఎంత కంగారు పడ్డానో తెలుసా?" అంటూనిలదీస్తాడు కార్తీక్.
Also read: కార్తీక్ ని టెన్షన్ పెడుతున్న రుద్రాణి.. దీప ఏం చేసింది?
కార్తీక్ కంగారు గమనించిన దీప .. "ఏంటంటడీ రుద్రాణి మళ్లీ ఏమైనా అందా?" అని అడుగుతుంది. దీంతో అసలు విషయం చెప్పేస్తాడు కార్తీక్. తనని రుద్రాణి ఏవిధంగా బెదిరించిందో చెప్పేస్తాడు. ఇంతలో హిమ, రౌడీ అమ్మా అంటూ వచ్చేస్తారు. రుద్రాణి తమతో వ్యవహరించిన తీరు, అన్నం తినమని బలవంతం చేసిందని చెబుతారు. కట్ చేస్తే.. సౌందర్య .. ఆదిత్యతో మోనిత గురించి చెబుతుంటుంది.. "మమ్మీ మనం మోనిత గురించి అవసరానికి మించి భయపడుతున్నాం. తన గురించి ఆలోచించడమే మానేద్దాం"అంటాడు. కట్ చేస్తే బస్తీలో మోనితకు వారణాసి చుక్కలు చూపిస్తుంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోందన్నది తెలియాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే.