లైవ్ లో ఏడ్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ హార్ట్ బ్రేక్!
on Jan 3, 2022

ఐదేళ్ల తమ ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరి దారులు వాళ్లు చూసుకుంటామని.. ఎవరి కెరీర్‌పై వాళ్లు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తాము విడిపోతున్నట్లు ఇటీవల దీప్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ పోస్ట్ పెట్టాడు. నిర్ణయం తీసుకునే హక్కు దీప్తికి ఉందని చెప్పాడు. ఆమె చాలా కష్టాలు పడిందనీ, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
దీప్తి, షణ్ముఖ్ బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి.. బ్రేకప్ గురించి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బ్రేకప్ గురించి ఓ నెటిజన్ దీప్తిని ప్రశ్నించగా.. జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని లేదని.. కెరీర్‌పరంగా ఏదైనా సాధించాలనుకుంటున్నానని.. ఇప్పటి వరకూ నా గురించి నేను ఆలోచించుకోలేదని.. అలాగే నా కెరీర్‌ని కూడా పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవాలనుకుంటున్నానని.. కెరీర్‌లో రాణించాలనుకుంటున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ దీప్తి కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరోవైపు షణ్ముఖ్ సైతం తాజాగా ఇన్‌స్టాలో డల్ గా ఉన్న తన ఫొటోని షేర్ చేసి.. హృదయం ముక్కలైన ఎమోజీలను ఎటాచ్ చేయడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



