English | Telugu
బ్రేకప్ గురించి చెప్పి బాధపడిన రోహిణి...
Updated : Aug 27, 2023
ఫామిలీ నంబర్ 1 ఈ వారం షో చాలా సందడిగా సాగింది. స్టార్టింగ్ లో ఒక్కో కపుల్ ఒక్కో విధంగా ప్రొపోజ్ చేసుకుని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ సెగ్మెంట్ తర్వాత భార్యలను భర్తలు ఎత్తుకుంటే హోస్ట్ రవి కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాళ్ళు వాటికి సరైన ప్రశ్నలు చెప్పారు. ఇక థర్డ్ సెగ్మెంట్ లో పాట పాడే సెగ్మెంట్ లో హోస్ట్ రౌడీ రోహిణి వచ్చి అద్భుతంగా పాడి వినిపించింది. "నీతో ఏదో అందామనిపిస్తోందే" అనే పాట పాడింది. "నువ్వు ఇంతమందిని చూస్తున్నావు కదా నీకు కూడా ఎవరైనా లవర్ ఉండాలని అనిపించదా " అని రవి అడిగేసరికి "నాకు లవర్ ఉండేవాడు కానీ బ్రేకప్ అయ్యింది.. అతను నన్ను కాకుండా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు...చెప్పాలి కదా నీకు వేరే అమ్మాయి ఉంటే అని అతనితో అన్నాను...బ్రేకప్ అయ్యాక ఆరు నెలలు చాలా బాధపడ్డాను..
నా ఫ్రెండ్స్ అంత సపోర్ట్ చేసి ఆ బాధ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు " అని చెప్పింది. తర్వాత మళ్ళీ రవి "నీకు పెళ్లి చేసుకోవాలని అనిపించదా" అని అడిగాడు .."ఇప్పుడు వున్న పరిస్థితిలో పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తోంది" అని రోహిణి అనేసరికి "అలా నాకు రోహిణి. మీ పేరెంట్స్ నీతో ఎంతో కాలం ఉండరు. లైఫ్ లాంగ్ ఉండేది నీ భర్త మాత్రమే..మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకో" అని సలహా ఇచ్చాడు కౌశల్. "నాకు నచ్చే అబ్బాయి వస్తే చేసుకుంటా. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు కనిపించిన వాళ్లంతా నన్ను లవ్ చేయడం లేదు వేరే వాళ్ళను లవ్ చేస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలి అంటే నన్ను హర్ట్ చేయకుండా తనతో ఈక్వల్ గా చూసుకోవాలి. నేను చేస్తున్న ఈ ప్రొఫెషన్ ని యాక్సెప్ట్ చేయాలి. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ప్రాణం. పెళ్లయ్యాక కూడా ఈ ఫీల్డ్ ని క్విట్ చేయాలనుకోవడంలేదు. అందులోనూ ఇండస్ట్రీ వాళ్ళు ఐతే అస్సలు వద్దు..ఇద్దరం ఇండస్ట్రీలో ఉంటె పిల్లల్ని చూసుకోవడం కుదరదు కదా..ఎలాంటి పరిస్థితిలో ఐనా సరే నాకు తోడుగా ఉండే అబ్బాయి కావాలి " అని చెప్పింది రోహిణి. దాంతో రవి అందరం తలా ఒక సంబంధం తీసుకొద్దాం అనేసరికి త్వరలో రోహిణి స్వయంవరం ఏర్పాటు చేద్దాం అని చెప్పింది మహి. ఇలా రోహిణి సెగ్మెంట్ కొంచెం ఫన్నీగా సాగింది.