English | Telugu

యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసిన మోనాల్!

చాలా కాలం క్రితం హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మోనాల్. 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆమెకి సరైన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. గతేడాది బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షోతో అమ్మడుకి క్రేజ్ బాగా పెరిగింది. తన గ్లామర్ తో చాలా మందిని ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు లవ్ ట్రాక్ లతో వార్తల్లో నిలిచింది.

హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ బులితెరపై 'డాన్స్ ప్లస్' షోలో జడ్జిగా కనిపించింది. ఈ షో పూర్తి కావడంతో స్టార్ మా ఛానెల్ మోనాల్ కి మరో ఆఫర్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ ఛానెల్ లో ఓ కామెడీ షోని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ షోకి మోనాల్ ను యాంకర్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై ఆమె సంతకం కూడా పెట్టేసిందట. ఎంతో గ్రాండ్ గా ఈ షోని డిజైన్ చేస్తున్నారని.. ఇందులో చాలా మంది పేరున్న కమెడియన్లు భాగం కానున్నారని స‌మాచారం. అందుకే మోనాల్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. యాంకర్ గా మోనాల్ గనుక క్లిక్ అయితే ఆమెకి బుల్లితెరపై మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.