English | Telugu

''దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం"!

బుల్లితెరపై యాంకర్ ఝాన్సీ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో తెలిసిందే. అలానే సినిమాల్లో కూడా ఏ పాత్ర చేసినా త‌న‌దైన ముద్ర వేస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అందరిలానే ఝాన్సీ కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు. షూటింగులన్నీ ఆగిపోవడంతో చాలా మంది సినీ కార్మికులు రోడ్డున పడుతున్నారు. దీంతో కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి వారికి సాయం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనాను విపరీతంగా ద్వేషిస్తున్నానంటూ ఝాన్సీ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తన బంధువుల పెళ్లికి హాజరు కాలేకపోయానని.. పెళ్లిని కూడా ఆన్లైన్ లో చూసుకోవాల్సి వచ్చిందనీ తెలిపారు. తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు. మామూలుగా అయితే సెలబ్రిటీలు షూటింగ్ ల కోసం, అలానే ట్రిప్ ల కోసం వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్లడం కుదరడం లేదు. దీన్నే సెటైరికల్ గా చెప్పారు ఝాన్సీ.

''మళ్ళీ త్వరలో ఇలా ట్రావెల్ చేసే రోజులు వస్తే బాగుండు.. అంతా మన చేతుల్లోనే ఉందంట ... తొందరగా వాక్సిన్ వేయించేసుకోండి. అప్పటి వరకు మాస్కేసుకుని... దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం. ( వాటిని ఎవరూ ఆపలేరుగా )'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో తన ట్రావెల్ ఫోటోని షేర్ చేసి రాసుకొచ్చారు. ఝాన్సీ చివరిగా 'మన్మథుడు 2' సినిమాలో కనిపించారు.