English | Telugu
దీప కోసం కార్తీక్ ఆ పని చేయగలడా.. పాపం జ్యోత్స్న!
Updated : Dec 6, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -534 లో... నా మాట అంటే ఎవరికీ విలువ లేదు కార్తీక్ వాళ్ళ నాన్న వచ్చి నన్ను ఎలా ప్రశ్నించాడు. ఆ ఇంటికి పనికి వద్దన్న వినట్లేదు స్వార్థపరురాలివి అంటూ దీప పై కాంచన కోప్పడుతుంది. ఎవరిని ఏం అనట్లేదు నా బాధ చెప్తున్న అని కాంచన లోపలికి వెళ్తుంది ఎవరికీ ఏం సమాధానం చెప్పలేక పోతున్న అని కార్తీక్ లోపలికి వెళ్తాడు ఇప్పుడు చెప్పాలిసింది నేనే అని దీప ఏడుస్తుంది.
మరొకవైపు జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని ఇంత మంచి గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెప్తావ్ ఏంటి అని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నని పిలుస్తాడు. సుమిత్ర నువ్వు స్వీట్ తీసుకొని రా అని చెప్తాడు. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని శివన్నారాయణ అంటాడు. ఇప్పుడు మీకు మీరు చేసే పనులకి అడ్డుగా ఉన్నానని పంపించాలని చూస్తున్నారు. ఆ దీపకి అన్ని మర్యాదలు చెయ్యడం అవసరమా అని జ్యోత్స్న ఇంట్లో వాళ్ళపై కోప్పడుతుంది. అది సంస్కారం లేని వాళ్లకు తెలియదని దశరథ్ కోప్పడతాడు.
ఆ తర్వాత జ్యోత్స్న చిన్నప్పటి బొమ్మలు చూస్తుంది సుమిత్ర. అప్పుడే దశరథ్ వస్తాడు . ఆ రోజు శౌర్యకి ఇవ్వగా ఇవి ఉన్నాయని బొమ్మలు చూపిస్తుంది. అవి దీపకి పుట్టబోయే బిడ్డకి అవుతాయని దశరథ్ అనగానే.. వద్దండి ఆ రోజు శౌర్యకి ఇస్తేనే జ్యోత్స్న ఎంత గొడవ చేసింది.. అమ్మనాన్నలుగా తన దృష్టిలో నెగెటివ్ అయ్యాం.. ఒక మంచి సంబంధం చూసి త్వరగా పెళ్లి చెయ్యాలని సుమిత్ర అంటుంది. మరొకవైపు నానమ్మ దగ్గర పడుకోమని శౌర్యతో కార్తీక్ చెప్తాడు. మీరు మారిపోయారు.. జో, గ్రానీ చెప్పినట్లే చేస్తున్నారని శౌర్య అనగానే.. ఏం చెప్పిందని కార్తీక్ అంటాడు. పారిజాతం చెప్పింది మొత్తం చెప్తుంది. అలా ఏం కాదు నిన్న అమ్మ కడుపుపై కాలితో తన్నావ్ అందుకేనని కార్తీక్, శౌర్యకి సర్ది చెప్తాడు కార్తీక్. అలా ఎవరి మాటలు వినొద్దని కార్తీక్ అనగానే శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.