English | Telugu

Bigg Boss Tanuja: అందరి ముందు తనూజని ఇరికించేసిన నాగార్జున.. భరణికి అన్యాయం!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఇక వచ్చీరాగానే డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ తో కాసేపు ఆడుకున్న నాగార్జున.. ఆ తర్వాత భరణి, తనూజలకి క్లాస్ పీకాడు.

భరణి, రీతూ, తనూజ మధ్య జరిగిన గొడవని మొదలెట్టాడు నాగార్జున. అందులో భాగంగా ముందుగా భరణిని లేపాడు. మ్యాథ్స్ స్టూడెంట్ భరణీ.. దేన్ని ట్రై యాంగిల్ అంటారో చెప్పమని అడిగాడు.

ఆ తరువాత ట్రై యాంగిల్ కాదని వాదించిన మొట్ట మొదటి సైంటిస్ట్ తనూజా.. లేమ్మా.. ట్రై యాంగిల్ అని దేన్ని అంటారని అడిగాడు. మూడు భుజాలు ఒకే విధంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పారు.. అందుకే నేను అబ్జెక్షన్ చెప్పానని తనూజ చెప్పడంతో.. ట్రై యాంగిల్ అంటే ఒకే షేప్‌లో ఉంటుందా.. ఇన్ని వారాలు ఉండేసరికి నాకు ఇలాగే వినిపించింది.. అనిపించిందని అనిపిస్తుందిలే.. పోనీ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం.. అన్నీ సమానంగా ఉండాలని. అప్పుడు భరణి పెట్టిన వాటిలో కూడా అన్నీ సమానంగా లేవు కదా అని నాగార్జున అడుగగా.. అది సైజ్ చిన్నగా ఉంది సర్.. బట్ భుజాలన్నీ సమానంగా ఉన్నాయని తనూజ చెప్పింది.

మనం గెలువాలనుకున్న వాళ్ల పక్కన నిలబడటంలో తప్పులేదు. కానీ ఒక వాదనకి దిగినప్పుడు అన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు అది ట్రై యాంగిల్ కాదంటావ్.. భరణి ఏకంగా.. బ్లూది ట్రై యాంగిల్ కాదు.. రెక్టాంగిల్ అంటాడు. మీ డౌట్ క్లారిఫై చేస్తానని నాగార్జున వివరిస్తాడు. ట్రయాంగిల్ లో ఎడ్జ్ తేడాగా ఉంది సర్ అని భరణి అనడంతో.. ఇది చెక్కినప్పుడు అలా కొంచెం బంప్ వచ్చింది.. నువ్వు పెట్టిన ట్రై యాంగిల్‌లో కూడా ఒకదానికి బంప్ ఉంది కదా.. కాబట్టి సంజనా సంచాలక్‌గా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నాగార్జున చెప్పాడు.

అయితే ఆ తేడాగా ఉన్న ట్రయాంగిల్ ఎందుకు పెట్టినట్టు, రీతూ ఆ రింగ్ ఎందుకు దాచినట్టు.. ఇక్కడ నిజంగా భరణికి అన్యాయం జరిగింది. మరి ఈ ఇష్యూలో ఎవరిది కరెక్ట్ అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.