English | Telugu

స్వప్న మనసు మార్చేసిన రాహుల్.. రాజ్, కావ్యలకి పొంచిఉన్న ప్రమాదం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -897 లో....... అప్పు పాప కేసు గురించి ఆలోచిస్తుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి అమ్మ నుండి తప్పించుకున్నాం కదా.. మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. రేణుక గారి గురించి ఆవిడ సిచువేషన్ ఏంటో అర్థం కావడం లేదు.. చుట్టుపక్కల అందరు పాప లేదు అంటుంటే తను మాత్రమే ఉందని అంటుందని అప్పు అంటుంది. నువ్వు ధైర్యం గల పోలీస్ ఆఫీసర్ వి.. ఒక కేసుని డీల్ చెయ్యడంలో ఎలాంటి భయాలు, టెన్షన్ లు పడొద్దు.. కేసు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుందో ఆలోచించమని కళ్యాణ్ అంటాడు.

మరొకవైపు రాజ్ నిద్రలేచి రెడీ అవుతూ కావ్యని లేపుతాడు. కానీ కావ్య ఆల్రెడీ రెడీ అయి పడుకుంటుంది. ఎప్పుడు రెడీ అయ్యావని రాజ్ షాక్ అవుతాడు. మీకంటే ముందు లేచి రెడీ అయ్యాను. ఇక్కడ బాబా గుడి ఉందట వెళ్లి వద్దామని కావ్య అనగానే రాజ్ సరే అంటాడు. మరొకవైపు రాజ్ కంపెనీ నుండి డిజైన్స్ తెప్పించి ఆ డిజైన్స్ గీయమని ఎంప్లాయికి చెప్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్, కావ్య గుడికి వెళ్తారు. అక్కడికి వీళ్ళ దగ్గరకి వచ్చి చనిపోయిన అతని బ్రదర్ వాళ్ళ దగ్గరికి వచ్చి.. మా తమ్ముడు డానీయల్ నిన్న మీ కార్ దగ్గరికి వచ్చి చనిపోయాడంట కదా.. వాడు ఏదైనా మీకు ఇచ్చాడా.. ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది. నీకు ఏమైనా మెంటలా.. అసలు అతను ఎవరో కూడ తెలియదని రాజ్ అతనిపై కోప్పడతాడు. అదంతా రౌడీలు చూసి రాజ్ వాళ్ళు అతనికి పెన్ డ్రైవ్ ఇస్తున్నారేమోనని అనుకుంటారు. రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. రౌడీ లు వాళ్లని ఫాలో అవుతూ వెళ్తారు.

మరొకవైపు తనే డిజైన్స్ సొంతగా చేపిస్తున్నాడని స్వప్నని నమ్మించాలని రాహుల్ తనని ఆఫీస్ కి రప్పిస్తాడు. స్వప్న క్యారేజ్ పట్టుకొని ఆఫీస్ కి వస్తుంది. ఈ డిజైన్స్ బాలేవుని రాహుల్ యాక్టింగ్ చేస్తుంటే.. బాగున్నాయ్ కదా అని స్వప్న అంటుంది. దాంతో స్వప్న మైండ్ లో ఆ డిజైన్స్ ని తనే డిజైన్ చేసాడని రాహుల్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.