English | Telugu

Bigg Boss Telugu 9: సీజన్-9 ట్రోఫీకి అర్హులు ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్-9 పదమూడో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రీతూ, భరణిల మధ్య ఇష్యూని సాల్వ్ చేశాడు నాగార్జున. ఆ తర్వాత హౌస్ లో ఎవరు ట్రోఫీకి అర్హులు అని మీరు అనుకుంటున్నారో చెప్పమంటూ కంటెస్టెంట్స్ ని అడిగాడు నాగార్జున.

లివింగ్ రూమ్ లో ఒక ట్రోఫీ ఉంది. అది తీసుకొని వాళ్ళకే ఆ ట్రోఫీ అర్హత ఉంది.. ఎందుకు ఉందని చెప్పాలని నాగార్జున ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ని చెప్పమని నాగార్జున అన్నాడు.

ఇక ఇమ్మాన్యుయేల్ వచ్చి.. ఎలాగైనా జనాలని నవ్వించాలి.. అదే నా కప్పు.. ఆ భారం నాకు ఉంది. అప్పటికప్పుడే తిట్టుకుంటాం.. అప్పటికప్పుడే గొడవలు పడతాం.. ఈ సిచువేషన్స్ అన్నీ చూసుకుంటూ కూడా ప్రతీరోజు ఎంటర్ టైన్ చేస్తున్నాను.. ఇది నాకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఆ సంకల్పంతోనే అడుగుపెట్టాను అని ఇమ్మాన్యుయేల్ చెప్పగానే హౌస్ మేట్స్ అంతా థమ్స్ అప్ పెట్టారు.

ఆ తర్వాత భరణి వచ్చి.. నా గేమ్ అంతా మార్చుకున్నాను.. నాకు ఎవరైతే స్ట్రాంగ్ అని అనుకున్నానో అతడిని కూడా ఓడించాను.. తాజాగా డీమాన్ పవన్ ని టాస్క్ లో ఓడించానని భరణి చెప్పాడు. ఇక ఆరుగురు థమ్స్ అప్ ఇవ్వగా.. రీతూ, డీమాన్ పవన్ మాత్రం థమ్స్ డౌన్ ఇచ్చారు.

మా ఇంటికి ఎవరైనా వస్తే ఎలా ఉంటానో అలాగే ఉన్నాను.. ‌నా ఇల్లు అనుకునే ఉన్నాను. ఏ గేమ్ అయినా ఏ టాస్క్ పెట్టినా నా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాను.. ఎప్పుడు కూడా అది మార్చుకోలేదని డీమాన్ పవన్ చెప్పాడు. ఇక నలుగురు థమ్స్ అప్ ఇవ్వగా ముగ్గురు థమ్స్ డౌన్ ఇచ్చారు.

ఇక ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి మాట్లాడాడు. నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు. నాకు తెలియక ఏం అయినా జరిగి ఉండొచ్చు.. కానీ‌ నేను జెన్యూన్ గా ఆడుతూ వచ్చానని కళ్యాణ్ చెప్పగానే హౌస్ మేట్స్ అంతా థమ్స్ అప్ ఇచ్చారు.

ఇక తనూజ వచ్చి చెప్పింది. గర్ల్ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ‌ఐ డిజర్వ్ దిజ్ అని‌ తనూజ అనగా.. అందరు థమ్స్ అప్ ఇచ్చారు.

ఇక రీతూ వచ్చి.. ప్రతీ గేమ్ లో నేను నా ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేను ఎలాగైనా ఫైనల్ లో ఉండాలని ఆడుతూ వచ్చాను. అందుకు ఐ ఫీల్ దట్ .. ఐ డిజర్వ్ దిజ్ అని రీతూ అంది. ఇక తనకి ముగ్గురు థమ్స్ డౌన్ ఇవ్వగా నలుగురు థమ్స్ అప్ ఇచ్చారు.

ఒక్క సింగిల్ టైమ్ కుడా ట్రూత్ లేకుండా ఏమీ మాట్లాడలేదు.. ప్రతీ సిచువేషన్.. డే వన్ నుండి ఇప్పటిదాకా అలాగే ఉన్నాను.. ‌జెన్యూన్ గా ఉన్నానని సంజన చెప్పగానే నలుగురు థమ్స్ అప్ ఇచ్చారు. ‌నలుగురు థమ్స్ డౌన్ ఇచ్చారు. సుమన్ ఎందుకు అని నాగార్జున అడుగగా.. తను నాకు థమ్స్ డౌన్ ఇచ్చింది.. అందుకే అనగానే హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు.

మరి ఈ సీజన్-9 లో ఎవరు బాగా ఆడుతున్నారు.. ఎవరు ట్రోఫీకి డిజర్వ్ అని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.