English | Telugu

ఆది ఎప్పుడూ ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉంటాడు!

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ, ఆది కాంబినేషన్ లో వచ్చే పంచులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా వేసుకుంటారు. ఆ విషయాన్నే ఇంద్రజ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.

"శ్రీదేవి డ్రామా కంపెనీలో టామ్ అండ్ జెర్రీలా ఉంటాం నేను, ఆది. మా మీద పంచులు వేస్తే మేము తీసుకోవాలంట కానీ మేము ఒక్క పంచ్ వేసినా ఆయన తీసుకోడు. మళ్ళీ రివర్స్ లో పంచ్ వేయాల్సిందే అది ఎలా ఉంటుంది అంటే చెత్తగా ఉంటుంది. ఎంత చెత్తగా ఉంటుంది అంటే ఈయన ఇగోకి పోతున్నాడు ఈయన మీద పంచులు వేస్తే తీసుకోలేకపోతున్నాడని ఓపెన్ గా తెలిసిపోతుంది. ఎప్పుడూ అమ్మాయిల మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. వాళ్లకు ముడతలు ఉన్నాయి, వయసైపోయింది, మొగుడిని కాల్చుకు తింటారు అంటూ ఉంటాడు. నేను ఒక్కటే చెప్తాను ఇది పదేళ్ల ఓల్డ్ జోక్ అంటాను.

నిజం చెప్పాలంటే ఆయన వర్క్ హాలిక్. వచ్చిన దగ్గర నుంచి వెళ్లిపోయేవరకు ఎలా పని చేయాలనేదే ఆలోచిస్తారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలెంట్ తో మాత్రమే ఎదిగిన వ్యక్తుల్లో ఆది కూడా ఒకరు. ఏదైనా ఈవెంట్ వస్తే అది ఆయన చేయలేకపోతే వేరే వాళ్లకు దాన్ని ఇవ్వడం.. అలా ఒకవేళ తాను వెళ్లే ఈవెంట్ లో తనతో పాటు వీళ్ళు వస్తారు అంటూ మిగితావాళ్లను కూడా తీసుకెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. ఎవరికైనా సాయం అనగానే చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ ఉంటారు. అందుకే అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నారు." అని ఆది గురించి చెప్పుకొచ్చింది ఇంద్రజ.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.