English | Telugu
Jayam serial: వీరూతో గంగ చేసిన శపథం.. తను జాబ్ చేస్తుందా?
Updated : Dec 7, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -134 లో... వీరు, గంగ మాట్లాడుకుంటారు. నీ నిజస్వరూపం తెలిసిన రోజు అమ్మగారు నిన్ను బయటకు పంపేస్తారు.. నేనే ఈ ఇంటికి పర్మినెంట్ నిన్ను ఎప్పుడు బయటకు పంపించేది తెలియదని గంగ అంటుంది. నీకు భయం అంటే ఏంటో పరిచయం చేస్తానని వీరు అంటాడు.
అప్పుడే పెద్దసారు వచ్చి ఎవరిని పరిచయం చేస్తానంటున్నావని అడుగుతాడు. అత్తయ్యకు నీపై మంచి అభిప్రాయం కలగాలంటే తనకి నచ్చినట్టు ఉండు.. అందుకు తెలిసిన వాళ్ళని పరిచయం చేస్తానని అంటున్నానని వీరు కవర్ చేస్తాడు.
ఆ తర్వాత వీరు అక్కడ నుండి వెళ్ళిపోయాక.... నువ్వు ఇంట్లో ఉంటే మీ అత్తయ్య నిన్ను చూస్తూ కోప్పడుతుంది. అందుకే నువ్వు ఇంట్లో ఉండకని పెద్దసారు అనగానే గంగ టెన్షన్ పడుతుంది. అంటే ఏదైనా జాబ్ చెయ్ అని పెద్దసారు అనగానే హమ్మయ్య అలా అంటున్నారా అని గంగ రిలాక్స్ అవుతుంది.
ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ మక్కమ్ దగ్గర కి వెళ్తుంది. గంగని చూసి అతను క్యాజువల్ గా మాట్లాడుతాడు. రుద్ర సర్ భార్య కదా అని గుర్తుతెచ్చుకొని మేడమ్ అంటాడు. నన్ను మేడమ్ అంటున్నావ్.. నాకు జాబ్ కావాలని అంటాడు. మీకు జాబ్ ఏంటీ మీరే ఓనర్ కదా అని మక్కమ్ అంటాడు.
ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ కి సంబంధించిన ఐడియా చెప్తుంది. అందరు తనని మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.