English | Telugu

డాక్ట‌ర్ బాబుతో త‌న‌ ప్రేమక‌థ‌ని బ‌య‌ట‌పెట్టిన మంజుల‌!

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్‌ `కార్తీక దీపం`. అశేష మ‌హిళాలోకాన్ని ఆక‌ట్టుకుంటూ నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ సీరియ‌ల్ తో డాక్ట‌ర్ బాబుగా పాపుల‌ర్ అయ్యారు ప‌రిటాల నిరుప‌మ్‌. ర‌చ‌యిత ప‌రిటాల ఓంకార్ త‌న‌యుడిగా టీవీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన నిరుప‌మ్‌ ల‌వ్ మ్యారేజ్‌. టీవీ న‌టి మంజుల‌ని నిరుప‌మ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే.

తాజాగా త‌మ ప్రేమ క‌థ‌ని, ఆ క‌థ వెన‌కున్న ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని మంజుల త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. నిరుప‌మ్‌, మంజుల‌ల ప్రేమ ప్ర‌యాణం `చంద్ర‌ముఖి` సీరియ‌ల్‌తో మొద‌లైంది. త‌న‌కు నిరుప‌మ్ ప్ర‌పోజ్ చేసిన రోజంటూ ఓ వీడియోని ` మా ల‌వ్‌స్టోరీ` పేరుతో విడుద‌ల చేసింది మంజుల. ఈ వీడియోలో మంజుల‌, నిరుప‌మ్ త‌మ ప్రేమ ఎప్పుడు ఎలా ఎక్క‌డ మొద‌లైందో చెప్పుకొచ్చారు. ఏడాది ప‌రిచ‌యం త‌రువాతే ఇద్ద‌రం ఫోన్ నంబ‌ర్‌లు తీసుకున్నామ‌ని ఇద్ద‌రు చెప్పొకొచ్చారు. ఈ సంద‌ర్భంగా నిరుప‌మ్ త‌న‌దైన స్టైల్లో మంజుల‌తో కామెడీ చేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

మంజుల‌తో క‌లిసి `చంద్ర‌ముఖి` సీరియ‌ల్ లో న‌టించాడు నిరుప‌మ్‌. అయితే అదే వీరికి తొలి సీరియ‌ల్ కావ‌డం, మంజుల‌కు తెలుగు రాక‌పోవ‌డంతో దాన్ని అడ్వాంటేజీగా తీసుకున్న నిరుప‌మ్ డైలాగ్‌లు వివ‌రించ‌డం.. సీన్‌ల విష‌యంలో ఎలా న‌టించాలో వంటివి చెప్పేవాడ‌ట‌. అలా ఇద్ద‌రి మ‌ధ్య ఏడాది పాటు కొన‌సాగిన ప‌రిచ‌యం ఆ త‌రువాత ప్రేమ‌గా మారింద‌ని, అదే పెళ్లికి దారితీసింద‌ని మంజుల చెప్పింది. ఇక ఇద్ద‌రి వ్య‌వ‌హారం ఇంట్లో తెలియ‌డంతో నిరుప‌మ్ ఇంట్లో వాళ్లు జాత‌కాలు క‌లిస్తేనే పెళ్లి అని చెప్పేశార‌ట‌. జాత‌కాలు క‌లిశాయి కాబ‌ట్టే ల‌క్కీగా మా పెళ్లి జ‌రిగింద‌ని నిరుప‌మ్ వివ‌రించాడు. ప్ర‌స్తుతం నిరుప‌మ్‌, మంజుల‌కు సంబంధించిన‌ప వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.