English | Telugu

నాగ్ సాక్షిగా ష‌న్నుకు షాకిచ్చిన సిరి

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ విమ‌ర్శ‌ల మ‌ధ్య 78వ ఎపిసోడ్‌ని పూర్తి చేసుకుని సోమ‌వారం 79వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. గ‌త 11 వారాలుగా అనేక విమ‌ర్శ‌ల మ‌ధ్య స‌ప్ప‌గా సాగుతున్నఈ సీజ‌న్ 5 మ‌రో నాలుగు వారాల్లో ముగియ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఆనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. దీంతో హౌస్‌లో మొత్తం 8 మంది మిగిలారు.

హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 19 మందిలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది ఎలిమినేట్ కాగా జెస్సీ అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. ఇక ఈ సండే ఫండేగా క‌నిపించినా ఇంటి స‌భ్యుల్లో కొంత మందికి షాకింగ్ డేగా మారింది. ప్ర‌ధానంగా ష‌న్ను, సిరిల‌కు సండే బిగ్ షాక్‌గా మారింది. లిప్‌లాక్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన ఈ జంట ఆదివారం కూడా హాట్ టాపిక్‌గా నిలిచారు. `అనుభ‌వించు రాజా` చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ త‌రుణ్ సిరిని ఉద్దేశించిన చేసిన కామెంట్ హైలైట్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా ఓ ర‌కంగా సరి, ష‌న్నుల‌కు చుర‌క‌లంటించిన‌ట్టుగా వుండ‌టం గ‌మ‌నార్హం.

సిరి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం... అయితే నీకు మాత్రం కాదు అని రాజ్ త‌రున్ సెటైర్ వేయ‌డం.. మీ ఇద్ద‌రి గురించి బ‌య‌ట మ‌రో ఇద్ద‌రు ఎదురు చూస్తున్నార‌ని మ‌రో సారి పంచ్ వేయ‌డంతో సిరికి ఆ పంచ్ గ‌ట్టిగా త‌గిలింది. దాంతో నాగ్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు సిరి `అవే త‌గ్గించుకుంటే మంచిది` అంటూ ష‌న్నుకి షాకిచ్చింది. దీంతో సిరి, ష‌న్నుల‌కు నాగ్ మ‌రోసారి గ‌ట్టిగానే ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినంత ప‌ని చేశాడ‌ని నెటిజ‌న్‌లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే నాగ్ చెప్పిన‌ట్టే సిరి, ష‌న్ను ఆ ఎక్స్‌ట్రాలే త‌గ్గించుకుంటే మంచిద‌ని కామెంట్‌లు చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.