English | Telugu

ప్రేమ లోకంలో బిగ్‌ బాస్ ముదురుజంట‌!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్. తాజాగా సీజ‌న్ 5 మొద‌లై మ‌రో నాలుగు వారాల్లో ముగియ‌బోతున్న విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్ చాలా దారుణంగా వుందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పైగా కంటెస్టెంట్‌ల ప‌రంగానూ చాలా విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతోంది. కంటెస్టెంట్ ల తీరు వెగ‌టు పుట్టించేలా వుంద‌ని ఓ రేంజ్‌లో నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సీజ‌న్‌లో హౌస్‌లోకి ఎంట్రి ఇచ్చిన జంట‌లపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న ముదురు జంట లోబో - ఉమాదేవి. వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన ల‌వ్ ట్రాక్‌.. వీరిద్ద‌రి కెమిస్ట్రీ ప‌లువురిని ముక్కున వేలేసుకునేలా చేసింది. ల‌వ్ అంటే ఇదా అని ఆశ్చ‌ర్యానికి లోన‌య్యేలా చేసింది. హౌస్‌లో కోట్లాది మంది చూస్తుండ‌గానే రెచ్చిపోయిన ఈ జంట బ‌య‌టికి వ‌చ్చాక కూడా అదే పంథాని కొన‌సాగిస్తూ ఫొటోల‌కి పోజులిస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ని ఒల‌క‌బోస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్‌లు పెడుతూ ర‌చ్చ చేస్తున్నారు.

ఇటీవ‌ల ఓంకార్ కామెడీ స్టార్స్ షోలో ఉమాదేవి తో రిలేష‌న్ షిప్‌పై ఓపెన్‌గానే చెప్పేసి షాకిచ్చాడు లోబో. అదే స్థాయిలో ఉమాదేవి కూడా ఓపెన్ అయిపోయి సోష‌ల్ మీడియాలో లోబోతో స‌న్నిహితంగా వున్న ఓ ఫొటోని షేర్ చేసి ఆస‌క్తిక‌రంగా స్పందించింది. ప్రేమ‌కి వ‌య‌సుతో సంబంధం లేదు. ఎప్పుడైనా పుట్టొచ్చు అంటూ హాట్ కామెంట్‌లు చేసింది. పెళ్లీడుకొచ్చిన ఇద్ద‌రు కూతుళ్లు వున్నా ప్రేమిస్తే త‌ప్పేంటీ? అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌లు ఇస్తోంది. ఉమ‌, లోబో ల‌కు సంబంధించిన ఓ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.