English | Telugu

ఆ నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -262 లో.. కృష్ణని ముకుంద ఎక్కడికి తీసుకొని వెళ్ళిందని మురారి టెన్షన్ పడుతుంటాడు. అయిన ఈ కృష్ణకి అయిన బుద్ధి ఉండొద్దని పిలవగానే వెళ్ళిపోతుందా అని మురారి అనుకుంటాడు. అప్పుడే ముకుంద వస్తుంది. కృష్ణని ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్ళావని మురారి అడుగుతాడు.

ఆ తర్వాత నీతో మాట్లాడాలి పైకి రా అని మురారితో ముకుంద చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారి బాల్కనీ దగ్గర ఉన్న ముకుంద దగ్గరికి వెళ్తాడు. కృష్ణని అసలు ఎందుకు తీసుకొని వెళ్ళవ్? నువ్వు ఎక్కడ మన గురించి చెప్తావో అని టెన్షన్ పడుతున్నాని మురారి అనగానే.. కృష్ణకి మన ప్రేమ గురించి చెప్పేశానని ముకుంద చెప్తుంది. మురారి షాక్ అవుతాడు. నేను వెళ్లి ఇన్ని రోజులు కృష్ణకి చెప్పకుండా దాచినందుకు సారీ అడుగుతానని మురారి వెళ్తుండగా ముకుంద ఆపుతుంది. ఆ తర్వాత మురారిని ముకుంద హగ్ చేసుకొని..

నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మురారి నిన్ను వదిలి నేను ఉండలేనని ఏడుస్తుంటు‌ంది. ముకుంద పిచ్చిగా చెయ్యకు వదులమని మురారి ఎంత అన్న కూడా ముకుంద వదలదు. మరొక వైపు మురారి ఎక్కడ కన్పించడం లేదని కృష్ణ వెతుక్కుంటూ బాల్కనీ వైపు వస్తుంటుంది. మరొక వైపు ముకుంద మురారిని హగ్ చేసుకొని మురారిని వదలదు. అప్పుడే అటుగా వస్తున్న కృష్ణ... మురారిని ముకుంద హగ్ చేసుకొని ఉండడం చూసి షాక్ అవుతుంది. నాకు నీ ప్రేమ కావలి మురారి, త్వరగా కృష్ణని ఇంట్లో నుండి పంపించు. మనం పెళ్లి చేసుకుందాం. పెద్ద అత్తయ్యకి జరిగింది చెప్దాం, ఆవిడే మన పెళ్లి చేస్తుందని మురారితో ముకుంద చెప్పడం.. కృష్ణ విని ఒక్కసారిగా కిందపడిపోతుంది. ముకుంద తనతో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటుంది. మరొక వైపు ముకుంద తన ప్రేమ గురించి ఎంత రిక్వెస్ట్ చేసిన మురారి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.

మరొక వైపు కృష్ణ గదిలోకీ వెళ్లి ఏసీపీ సర్ నాకు అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పారంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత మురారిపై ముకుంద ప్రవర్తించిన తీరుని గుర్తుచేసుకొని బాధపడుతుంది. అందరూ నన్ను ఇంత మోసం చేసారు. ముకుంద నన్ను ఇంత మోసం చేసావ్? అందరిని నేను నమ్మడం నా తప్పని కృష్ణ బాధపడుతుంది. మరొక వైపు అలేఖ్య, మధు ఇద్దరు ఎప్పటిలాగే గొడవ పడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.