English | Telugu

లవ్ ప్రపోజ్ చేయమని కళ్యాణ్ కి సలహా ఇచ్చిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -201 లో.... తాతయ్యతో జరిగిన గొడవ చెప్పనందుకు కావ్యకి థాంక్స్ చెప్తాడు. మీరు థాంక్స్ కూడా ఏదో లాగా చెప్తున్నారని కావ్య అంటుంది. నాకు ముందు సారీ చెప్పండని కావ్య అనగానే.. సారీ ఎందుకని రాజ్ అడుగుతాడు. ఇందాక మీ ఫోన్ ముట్టుకుంటే తిట్టారు కదా అని కావ్య అంటుంది. నేను సారీ చెప్పను థాంక్స్ మాత్రమే చెప్తానని రాజ్ అంటాడు.

ఆ తర్వాత రాజ్ పడుకుంటాడు. ఇక నిద్రలో కావ్య వెళ్లి సీతరామయ్యకి నిజం చెప్పినట్టు కల కంటాడు రాజ్. దాంతో ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి ఇదంతా కలనా అని అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్ భార్యని ఎలా ఏదిరించి శక్తి పొందాలని టీవీ లో చూస్తూ ఆసనం వేస్తాడు. అలా వేసిన ఆసనం రాజ్ కి తియ్యడం రాదు. అప్పుడే కావ్య వస్తుంది. నన్ను విడిపించూ అని రాజ్ అనగానే.. నాకు సారీ చెప్తేనే విడిపిస్తానని రాజ్ ని కొద్దిసేపు ఆటపట్టిస్తుంది కావ్య. ఆ తర్వాత కావ్యకీ రాజ్ సారీ చెప్పడంతో ఆసనం విడిపిస్తుంది కావ్య. ఆ తర్వాత కావ్య కాఫీ తీసుకొని వెళ్తుంటే.. నేను ఇక్కడే ఉన్నాను. నాకు ఇవ్వాలనీ తెలియదా అని కావ్యతో రుద్రాణి అంటుంది. ఇది కళ్యాణ్ కి తీసుకొని వెళ్తున్నా పది నిమిషాలు ఆగండి‌ లేదంటే మేరే వెళ్లి చేసుకోండని కావ్య అనగానే.. పొగరుగా సమాధానం చెప్తున్నావ్. నీ వెనకాల నీ భర్త తిరుగుతున్నాడని ఈ పొగరు వచ్చిందా అంటూ మళ్ళీ వాళ్ళ పుట్టింటి స్థితి గురించి మాట్లాడేసరికి.. కావ్యకి కోపం వస్తుంది. రుద్రాణికి కావ్య ఘాటుగానే సమాధానం ఇవ్వడంతో.. నాతోనే ఇలా మాట్లాడుతూవా నీ సంగతి చెప్తానని రుద్రాణి అనుకుంటుంది. మరొక వైపు అపర్ణ దగ్గరికి శాంత వెళ్లి డబ్బు కావాలని అడుగుతుంది. అప్పుడు అపర్ణ ఇవ్వనని చెప్తుంది. అది విన్న రుద్రాణి శాంత బయటకు రాగానే నువ్వు అడగాల్సింది అప్పటి కోడలిని కాదు, ఇప్పటికోడలినని.. వెళ్ళి కావ్యని అడుగమని శాంతకి రుద్రాణి సలహా ఇస్తుంది.

మరొక వైపు కళ్యాణ్ కీ కాఫీ తీసుకొని వెళ్లి ఇస్తుంది కావ్య. కళ్యాణ్ బుక్ చదువుతు నిద్రపోవడం చూసిన కావ్య అనామిక గురించి ఆలోచిస్తున్నావు కదా? నీ ప్రేమ విషయం త్వరగా అనామికకీ చెప్పు అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేసి మాట్లాడుతుంది. తన మాటల్లో అనామికకి కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నట్లు అనిపించి, ఎలాగైనా నా ప్రేమని అనామికకి చెప్పాలని కళ్యాణ్ అనుకుంటాడు. అందుకు మంచి ఐడియా ఇవ్వమని అప్పుని అడగాలని తనకి ఫోన్ చేస్తాడు కళ్యాణ్. కలిసి మాట్లాడాలని కళ్యాణ్ చెప్పగానే.. అప్పు సరే అంటుంది. మరొక వైపు కావ్యని శాంత డబ్బు అడుగుతుంది. సరే ఆయనని అడిగి తీసుకొని వస్తానని కావ్య వెళ్లి రాజ్ ని అడిగి డబ్బు తీసుకుంటుంది. మరొక వైపు నువ్వు శాంతకి డబ్బు ఇవ్వను అన్నావ్ కదా? నీ కోడలు ఇస్తుందని అపర్ణతో రుద్రాణి చెప్పగానే కావ్యపై కోప్పడుతుంది‌. రుద్రాణి ఇంట్లో గొడవ చేయడానికి అలా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.