English | Telugu

తన భార్య గురించి ఏంజిల్ కి చెప్పిన రిషి.. సౌజన్యరావుని తను డీల్ చేయగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -868 లో.. ఎందుకు పెళ్లి వద్దని అంటున్నావని, నీ భార్య గురించి చెప్పమని ఏంజిల్ పదే పదే రిషికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటుంది. మనుషులు విడిపోయినంత మాత్రాన మనుషులు విడిపోయినట్లు కాదు తన జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉంటాయని రిషి అనగానే వసు సంబరపడిపోతుంది.

ఆ తర్వాత ఎలాగైనా రిషి భార్య గురించి తెలుసుకోవాలనుకోని.. నీ భార్య ఎక్కడ ఉంటుందని ఏంజిల్ అడుగుతుంది. రిషి సైలెంట్ గా ఉండడంతో నువ్వు ఇప్పుడు నీ భార్య గురించి చెప్పలేదంటే నువ్వు చెప్పేది అబద్ధమని అనుకుంటామని ఏంజిల్ అంటుంది. నీ భార్య ఎక్కడ ఉందని ఏంజిల్ అనగానే నా భార్య ఇక్కడే ఉందని రిషి అంటాడు. అంటే నీ భార్య వసుధరనా అని ఏంజిల్ అడుగుతుంది. వసుధార నా భార్య అని చెప్పానా? మరి ఇక్కడ అంటే ఎక్కడ ఈ సిటీ లోన నాకు తెలుసా అని ఏంజిల్ అడుగుతుంది. నీకు చూపిస్తాను కానీ ఇప్పుడు కాదు, టైమ్ వచ్చినప్పుడు అని రిషి అంటాడు. లేదు ఇప్పుడు చెప్పలని ఏంజిల్ వాదిస్తుంది. అయిన రిషి వసుధార గురించి చెప్పడు. నీకు పదిహేను రోజులు టైమ్ ఇస్తున్న ఈ లోపు నీ భార్య ఎవరో చెప్పాలి లేదంటే నువ్వు చెప్పేది అబద్ధం అవుతుంది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని ఏంజిల్ కండిషన్ పెడుతుంది. మరొక వైపు జగతికి ఫణీంద్ర ఫోన్ చేసి.. కాలేజీలో జరిగేది చెప్తాడు దాంతో జగతి కంగారు పడుతూ మనం ఇప్పుడు కాలేజీ వెళ్ళాలని మహేంద్రతో చెప్తుంది.. ఆ తర్వాత జగతి మహేంద్ర, వసుధార వెళ్తారు.

మరొక వైపు ఏంజిల్ దగ్గరికి విశ్వనాథ్ వెళ్లి మాట్లాడతాడు. రిషి పెళ్లి వద్దన్నాడని బాధపడుతున్నవా అని అడుగుతాడు. లేదు రిషి నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే తనని ప్రేమించలేదు కానీ పెళ్లి చేసుకోవాలనుకోని అవకాశం తీసుకున్నాను. అంతే రిషి ఎప్పుడు గతం గురించి బాధపడుతుంటాడు. ఆ గతం గురించి తను చెప్పేలా తనపై ఈ పెళ్లి ఒత్తిడి తీసుకొచ్చాను. ఇప్పటికైనా రిషి తన బంధం గురించి చెప్పాడు. రిషి మంచివాడు తను హ్యాపీగా ఉండాలి. నీకు నచ్చిన అబ్బయితో, నాకు పెళ్లి చెయ్ నేను మనస్ఫూర్తిగా అంగీకారిస్తానని ఏంజెల్ అనగానే విశ్వనాథ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు ఫణింద్రతో, సౌజన్య రావుతో జగతి ఫోన్ లో మాట్లాడుతుంది. అయిన సౌజన్య రావు కాలేజీ విషయం లో కాంప్రమైజ్ కాడు. రిషి, వసుధార, మహేంద్ర, జగతి కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. రిషికి సౌజన్యరావు చేస్తున్న కుట్ర గురించి చెప్తాడు. మన కాలేజీని వాడి చేతిలోకి తీసుకోవాలని అనుకుంటాడు. నువ్వు ఇప్పుడు మాతో పాటు రావాలి. నువ్వు అయితేనే సౌజన్యరావుని డీల్ చెయ్యగలవని జగతి, మహేంద్రలు రిషిని రిక్వెస్ట్ చేస్తారు. అయిన నేను రాను నన్ను మీరు ఒక నింద వేసి బయటకు పంపించారు. నేను రాలేనని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.