English | Telugu
వాళ్ళ ఫ్యామిలీని అవమానించినందుకు రుద్రాణిపై కావ్య ఫైర్!
Updated : Jun 8, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -116 లో.. కిచెన్ లో వంట చేస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. మా అమ్మకి నువ్వు పూజ చేయడం ఇష్టం లేదు, అయినా ఎందుకు చేసావ్? నువ్వు కిచెన్ లోకి రావడం ఇష్టం లేదు, ఎందుకు వచ్చావ్? అని కావ్యని అంటాడు. ఈ ఇంటి కోడలిగా ఇంట్లో ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుందని కావ్య అంటుంది.
ఆ తర్వాత రాజ్ కోపంగా ఉంటాడు. ఏవండి నాకు ఆ డబ్బా అందడం లేదు కాస్త తీసి ఇస్తారా అని కావ్య అనగానే రాజ్ ఒక్కసారిగా కావ్యని ఎత్తుకుంటాడు. కావ్య అలానే ఆశ్చర్యపోయి చూస్తుంది. కావ్యని ఎత్తుకోవడం చూసిన ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ.. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలనే నేను కోరుకునేది కానీ ఇలాంటివి అన్నీ మీ గదిలో చెయ్యండని ధాన్యలక్ష్మి నవ్వుతూ చెప్పేసి వెళ్ళిపోతుంది. పిన్ని నువ్వు అనుకునేది ఇక్కడ ఏం జరగలేదని రాజ్ అంటాడు. నేను డబ్బా అందట్లేదన్నాను.. నన్ను ఎత్తుకోవాలా? మీరే తీసి ఇవ్వొచ్చు కదా అని కావ్య అంటుంది.
రాజ్ అవును కదా అంటూ బిత్తెరపోయి చూస్తాడు. ఎలాగైనా నన్ను మీరు తాకాలని చూస్తున్నారని కావ్య అంటుంది. ఛీ ఛీ ఆ ఇంటెన్షన్ లేదు, ఇంట్రెస్ట్ లేదని రాజ్ అంటాడు. ఆ రోజు తాగి నా గదిలోకి వచ్చారు.. ఇప్పుడు ఇలా అంటూ సిగ్గుపడుతుంది కావ్య. దాంతో అక్కడినుండి రాజ్ చిరాకుగా వెళ్ళిపోతాడు. మరొకవైపు కనకం దగ్గరికి మీనాక్షి వస్తుంది. రాహుల్ తో స్వప్న పెళ్లి జరిపిస్తానని అన్నందుకు మీనాక్షి, కనకం ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కనకంకి ధాన్యలక్ష్మి ఫోన్ చేసి.. స్వప్న, రాహుల్ పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పిలిపించారు. మీరు కూడా ఉంటే బాగుంటుందని పిలవమని చెప్పారని అంటుంది. కనకం హ్యాపీగా ఫీల్ అవుతూ.. సరే వస్తాం అని చెప్తుంది.
మరొకవైపు అప్పు కోసం కళ్యాణ్ వస్తాడు. కానీ అప్పు మాత్రం కొంతమంది బాయ్స్ తో కబడ్డీ ఆడుతుంది. అప్పు బ్యాచ్ లో ఒకరు తక్కువగా ఉండడంతో కళ్యాణ్ ఆడతాడు. కళ్యాణ్ అవుట్ అవడంతో అక్కడున్న బాయ్స్.. నువ్వు వాడికి గర్ల్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఆ అంటూ ఎగతాళి చేస్తారు. అప్పుడు అప్పు కోపంతో నెక్స్ట్ మ్యాచ్ లో ఈ కళ్యాణ్ తోనే ఆడి గెలుస్తానంటూ ఛాలెంజ్ చేస్తుంది. దాంతో కళ్యాణ్ వామ్మో అంటూ షాక్ అవుతాడు. మరొకవైపు దుగ్గిరాల ఇంటికి వెళ్లిన కనకం కుటుంబాన్ని రుద్రాణి అవమానిస్తుంది. దాంతో కావ్య ఘాటుగా సమాధానమిస్తుంది. "ఒక్కసారి రాహుల్ కి పెళ్లి అని పేపర్ లో వెయ్యండి ఎంత మంది కోడళ్ళు బయటపడుతారో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే ఎంతమంది మీ అబ్బాయికి ఫోన్ చేశారో కనుక్కోండి.. మీరు మా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా" అంటూ రుద్రాణిపై కావ్య కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.