English | Telugu

బాధని తగ్గించుకోవడం కోస‌ం డ్రింక్ చేసిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -177 లో.. మీరు నాకు ఒక మనవడినో మనవరాలినో ఇవ్వండని కృష్ణ, మురారీలతో రేవతి అనేసరికి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఏంటి అనవసరంగా రేవతి అత్తయ్య కి నిజం చెప్పానా? నేను చెప్పడం వల్లే రేవతి అత్తయ్య కృష్ణ, మురారి చేత బలవంతంగా కాపురం చేయిస్తుందా అని ముకుంద టెన్షన్ పడుతుంది.

మరొకవైపు ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ ని రేవతి కలుస్తుంది. ఎలాగైనా ముకుందకి ఆదర్శ్ తో విడాకులు ఇప్పించాలని రేవతి అంటుంది. నా కూతురు జీవితం బాగుంటే అంత కన్నా కావలసిందేముంది చెల్లెమ్మ అని శ్రీనివాస్ అంటాడు. నీ కొడుకు కోడలు జీవితం బాగుండాలని నువ్వు, నా కూతురు జీవితం బాగుండాలని నేను అనుకుంటున్నాను అని ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ అంటాడు. నాకు నిజం తెలిసింది అన్నయ్య అని రేవతి అంటుంది. ఎలాగైనా ముకుందని మా ఇంటికి వచ్చేలా చెయ్యమని మురారిని అడిగానని రేవతితో శ్రీనివాస్ అంటాడు. కృష్ణ, మురారిలు బాగుండాలి అలాగే ముకుంద జీవితం కూడా బాగుండాలి.. అందుకు నా ప్రయత్నం నేను చేస్తానని రేవతి అంటుంది. నువ్వు ఇలా చెప్తుంటే నిజంగా ముకుంద జీవితం బాగు చేస్తావని అనిపిస్తుంది చెల్లెమ్మ అని శ్రీనివాస్ అంటాడు.

మరొక వైపు మురారి డైరీని చదివిన కృష్ణ.. మురారి లైఫ్ లో వేరొక అమ్మాయి ఉందని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఆ తరువాత కృష్ణ, మధు డ్రింక్ చేస్తుంటే అక్కడికి వస్తుంది. బాధగా ఉంది.. ఇది తాగితే తగ్గుతుందా అంటూ మందు బాటిల్ తీసుకొని తాగుతుంది కృష్ణ. మధు షాక్ అవుతూ చూస్తాడు. కృష్ణ డ్రింక్ చేసి మాట్లాడుతుంటే రేవతి వచ్చి.. ఏమైంది కృష్ణ అని అడుగుతుంది. నా కోడలి చేత మందు తాగించావా అని మధుని కోప్పడుతుంది రేవతి. బాధగా ఉంది.. బాధ తగ్గిపోతుందని తాగానని కృష్ణ అంటుంది. ఇక రేవతి ముకుంద మాటలు గుర్తుచేసుకుంటుంది.

కాసేపటికి కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కృష్ణని మురారి బాగా చూసుకుంటాడు కదా? మరి కృష్ణకి బాధేంటని రేవతితో మధు అంటాడు. ఆ తర్వాత మధు వెళ్లి డ్రింక్ చేస్తుండగా.. అలేఖ్య వచ్చి కృష్ణ వచ్చి డ్రింక్ చేసింది కదా అని అడుగుతుంది.‌ అదేం లేదని మధు అంటాడు. అయినా నీకు ఎలా తెలుసని మధు అంటాడు. నేను మీ దగ్గర లేను కానీ ఈ ఇంట్లోనే ఉన్నానని అలేఖ్య అంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.