English | Telugu

క్లాస్ లో కేడీ బ్యాచ్ అల్లరి..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -783 లో... వసుధార హాల్లో కూర్చొని బుక్స్ చూస్తుంటుంది. అప్పుడే కేడి బ్యాచ్ లీడర్ పాండియన్ తండ్రి మురుగన్ కొంతమంది రౌడీలతో వసుధార వాళ్ళ ఇంట్లోకొచ్చి వస్తువులన్నీ కింద పడేస్తాడు. అప్పుడే చక్రపాణి బయటకు వచ్చి.. ఎవరు మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతాడు. నేను వచ్చింది మీ కోసం కాదు.. మీ కూతురు కోసమని మురుగన్ అంటాడు. చక్రపాణి షాక్ అవుతూ చూస్తాడు.

మీ కూతురు లెక్చరర్ గా చేసే కాలేజీలో నా కొడుకు చదువుతున్నాడు. నేను మురుగన్ తండ్రిని అని వసుధారకి చెప్తాడు. గతంలో వేరొక మేడం పాండియన్ తండ్రి మురుగన్ పెద్ద రౌడీ అని చెప్పిన విషయాన్ని వసుధార గుర్తుచేసుకుంటుంది. నా కొడుకు పాండియన్ కి ఈ సిటీ లో ఏ కాలేజీ నచ్చలేదు. ఈ ఒక్క కాలేజీ మాత్రమే నచ్చింది. నువ్వు చైర్మన్ కి కంప్లైంట్ చేసి సస్పెండ్ చేపిస్తా అన్నావంట కదా.. నా కొడుకుకి నచ్చినట్లు ఉండనివ్వు. కాదని ఏమైనా చేసినా నా గురించి మీకు తెలియనట్టు ఉంది. నేనొక పెద్ద రౌడీని అని వసుధారని బెదిరిస్తాడు మురుగన్. "కన్నకొడుకు అలా చెడిపోతుంటే బుద్ధి చెప్పాలిసింది పోయి వత్తాసు పలుకుతరా" అని వసుధార కోప్పడుతుంది.

నీతులు చెప్పకు అని వసుధారని బెదిరించి మురగన్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార ప్రిన్సిపల్ ని తీసుకొని చైర్మన్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే చైర్మెన్ ఇంట్లోనే ఉంటాడు రిషి. తనని చూడదు వసుధార. వసుధార చైర్మన్ తో కేడి బ్యాచ్ వాళ్ళు చేసే అల్లరి గురించి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్తుంది. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న రిషి.. ఇది వసుధార వాయిస్ లా ఉందని కిందకి వస్తాడు. రిషి వచ్చేలోపే వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని చైర్మెన్ ని అడుగుతాడు. నాకోసం వచ్చారు కాలేజీ గురించి మాట్లాడడానికి అని చైర్మెన్ అంటాడు. అయినా నా గురించి ఎవరు వస్తారు.. నాకు ఎవరున్నారు మీరు తప్ప అని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు వసుధార చైర్మన్ కి కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలుసుకుంటారు కేడి బ్యాచ్. అప్పటినుండి వసుధారపై కోపంగా ఉంటారు ఎలాగైనా దాని పరువు తీసి కాలేజీ వదిలి వెళ్లేలా చెయ్యాలని అనుకుంటారు కేడి బ్యాచ్. వసుధార క్లాస్ కి వెళ్లి కేడి బ్యాచ్ కి మంచి మాటలు చెప్తుంది. ముందుగానే కేడి బ్యాచ్ వసుధార నిల్చొని ఉండే దగ్గర పైన బెలున్ లో వాటర్ నింపి ఉంచుతారు. వసుధార రాగానే తనపై వాటర్ పడేలా చేస్తారు. అది చూసి అందరూ నవ్వడంతో వసుధార కోపంగా క్లాస్ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు జగతి ఒకప్పుడు వసుధార ఉన్న ఇంటికి వస్తుంది.

ఎన్ని సార్లు వచ్చినా ఎవరు ఉండకపోవడంతో పక్కన వాళ్ళని వసుధార గురించి అడుగుతుంది. వసుధార అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. వసుధార అత్తగారి ఇంటి నుండి వచ్చాకే సుమిత్ర గుండెపోటుతో చనిపోయిందని పక్కింటి ఆమె చెప్తుంది. అది విని జగతి షాక్ అవుతుంది. నేను చేసిన ఒక పనివల్ల ఇంత మంది బాధపడుతున్నారు. నా వల్లే ఇదంతా.. వసుధార నన్ను ఎప్పటికి క్షమించదని అనుకుంటూ జగతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.