English | Telugu
రాజ్ రాసిన ఆ చీటీలో ఏముందో కావ్య తెలుసుకోగలదా?
Updated : Oct 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -217 లో.. కావ్య తన అత్తగారితో ఫోన్ చేపించి కనకాన్ని పూజకి రప్పించాలని అనుకుంటుంది. ఇక అపర్ణ దగ్గరికి కావ్య వెళ్ళి రివర్స్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. మేం మా ఇంటికి వెళ్లి వస్తాం, ఇంటి పత్రాలు రాజ్ చేత తీసుకోవాలని మా వాళ్ళు అనుకుంటున్నారని కావ్య అనగానే.. ఆ మాత్రం దానికి వెళ్లడం ఎందుకు? వాళ్లనే రమ్మంటే సరిపోతుందని అపర్ణ అనగానే.. మా అమ్మ ఎవరు చెప్పిన వినదని కావ్య అంటుంది.
ఇక కావ్య అలా అనేసరికి.. నేను చెప్పినా వినద అని అపర్ణ అంటుంది. అలా అనగానే వినదని కావ్య అంటుంది. ఎలా వినదో నేను చూస్తానంటు కనకానికి అపర్ణ ఫోన్ చేసి.. పూజకి రమ్మని చెప్పగానే కనకం వస్తానని అంటుంది. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం అందరు వినాయకుని పూజకి రెడీ అవుతారు. రాజ్ , మిగతా వాళ్ళు వినాయకుడి విగ్రహం తీసుకొని వస్తారు. ఆ తర్వాత ఇందిరాదేవి అందరి కోరికలు ఒక చీటీపై రాసి దేవుడి దగ్గర పెడితే.. ఆ కోరిక నెరవేరుతుంది. ఇది ఎక్కడ జరగదు ఒక దుగ్గిరాల కుటుంబంలోనే జరుగుతుందని చెప్తుంది. దాంతో అందరు ఎవరికి వారే తమ కోరికలను చీటీలో రాస్తుంటారు. రాజ్ మనసులో స్థానం కావాలని కావ్య తన చీటీ మీద రాస్తుంది. కావ్యతో ప్రేమగా కేవలం తాతయ్య కోసం మాత్రమే ఉంటున్నానని రాజ్ తన చీటీ పై రాస్తాడు. రాజ్ ఏం రాశాడని కావ్య తెలుసుకోవాలని ట్రై చేస్తుంటుంది కానీ రాజ్ తనకి తెలియకుండా రాస్తాడు. ఆ తర్వాత అందరి చీటీలో ఒక గిన్నెలో వేస్తారు. రాజ్ చీటీలో ఏం రాసి ఉంటాడని రాజ్ చీటీ వైపే చూస్తూ ఉంటుంది కావ్య.
ఆ తర్వాత కాసేపటికి అందరు ఎవరి గదుల్లోకీ వాళ్ళు వెళ్ళిపోగానే.. రాజ్ ఏం రాశాడో చూడాలని కావ్య ఆ చీటీ తియ్యబోతుంటే కళ్యాణ్ కంగారుగా కావ్య దగ్గరకీ వస్తాడు. ఏంటి అని కావ్య అడుగగా.. ఆ అనామిక మన ఇంటికి వస్తుందంట, నాకేదో టెన్షన్ గా ఉందని కళ్యాణ్ చెప్తాడు. టెన్షన్ పడకని కావ్య కళ్యాణ్ కి సర్ది చెప్తుంది కావ్య. మరొకసారి చీటీ తీస్తుంటే.. దాన్యలక్ష్మి వచ్చి పని ఉందంటూ కావ్యని తీసుకొని వెళ్తుంది. కాసేపటికి కనకం ఫ్యామిలీ కావ్య దగ్గరకి వస్తారు. వాళ్ళని చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
