English | Telugu
ముకుందపై డౌట్ పడిన ప్రభాకర్.. నిజం తెలుసుకుంటాడా?
Updated : Oct 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -278 లో.. కృష్ణ గదిలో ఉన్న ప్రభాకర్ తన అన్న ఫోటోని చూస్తూ ఎమోషనల్ అవుతాడు. కాసేపటికి పెళ్లి అయి ఇన్ని రోజులు అవుతుంది. నా చేతిలో మనవడిని పెట్టలేదని మురారిని ప్రభాకర్ అడుగుతాడు. ఇప్పుడు ఎందుకు మామయ్య, మీ కూతురే చిన్న పిల్ల అని అనగానే అంటే ఏసీపీ సర్ దృష్టిలో నేను చిన్నపిల్లనా అంటు నసుగుతుంది కృష్ణ.
ఆ తర్వాత కృష్ణ తన తింగరి పనులతో కొన్ని కప్ లలో షుగర్ ని వేస్తుంటుంది. అది చూసి మురారి ఎందుకు అలా చేస్తున్నావని అడుగుతాడు. ఒకతను ఇలా చేస్తుంటే చూసా అని కృష్ణ అనగానే.. అలా కాదు ఇలా వెయ్యాలంటు కృష్ణకి దగ్గరగా చెయ్యి పట్టుకొని మురారి కప్ లో షుగర్ వేస్తుంటే కృష్ణ రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి.. రేపు ప్రొద్దున వినాయకుడి పూజకి సంబంధించినవన్ని తీసుకొని రావాలని మురారి అనగానే.. అంత ప్రొద్దున వద్దు బ్రేక్ ఫాస్ట్ చేసి వెళదామని కృష్ణ అంటుంది. అన్ని అక్కడే అని మురారి అంటాడు. సరే అని కృష్ణ అంటుంది. కృష్ణ, మురారి లు మాట్లాడుకున్న మాటలన్ని ముకుంద విని.. మీరు ఎలా వెళ్తారో నేను చూస్తానని అనుకుంటుంది. మరొక వైపు ప్రభాకర్ కోసం డ్రింక్ సెట్ చేసి మధు వెయిట్ చేస్తుంటాడు. కాసేపటికి ప్రభాకర్ వచ్చి డ్రింక్ చేస్తాడు. ముకుంద గురించి డౌట్ వచ్చిన ప్రభాకర్.. తన గురించి మధుని అడుగుతాడు. మధుకి కూడా ముకుంద అంటే పడదు కాబట్టి ముకుంద గురించి చెప్తాడు. అంతే కానీ తన ప్రేమ విషయం ప్రభాకర్ ముందు బయటపెట్టాడు.
ఆ తర్వాత ప్రభాకర్ భవాని దగ్గరకి వెళ్లి తన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాడు. మీ పెద్ద కొడుకు ఇంట్లో లేనప్పుడు ముకుంద ఇక్కడ ఎందుకు వాళ్ళ పుట్టింటికి పంపిస్తే అక్కడ హ్యాపీగా ఉంటుంది కదా అని ప్రభాకర్ అంటాడు. ఆదర్శ్ వస్తాడు వచ్చేవరకు ముకుంద కూడా ఇక్కడే ఉంటుందని కోడళ్ళు అయిన నాకు కూతుళ్లుతో సమానమ భవాని చెప్తుంది. అదంతా పైనుండి చూస్తున్న ముకుంద.. అత్తయ్యకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం. నన్ను కూతురని అనుకుంటుంది కాబట్టి తన కూతురు ప్రేమని అర్ధం చేసుకున్నట్లు.. నా ప్రేమని అర్థం చేసుకుంటుందని ముకుంద అనుకుంటుంది. మరొకవైపు ప్రభాకర్ కి ముకుంద పై డౌట్ ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.