English | Telugu
Karthika Deepam2 : కాశీకి డీల్ ఇచ్చిన జ్యోత్స్న.. ఇంట్లో రచ్చ!
Updated : Jul 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -403 లో....దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. గౌతమ్ మంచివాడు కాదు కదా.. జ్యోత్స్న పెళ్లి అతనితో జరిగితే పరిస్థితి ఏంటని దీప అనగానే జ్యోత్స్నకి గౌతమ్ గురించి తెలుసు కాబట్టి జ్యోత్స్న సిచువేషన్ అంతవరకు తెచ్చుకోదు కానీ నువ్వు మాత్రం జ్యోత్స్న దగ్గరికి వెళ్లి గౌతమ్ మంచివాడు కాదని చెప్పే ప్రయత్నం చేసావనుకో జ్యోత్స్న అది రికార్డు చేసి ఇంట్లో వాళ్లకి వినిపిస్తుంది. దాంతో నువ్వు మళ్ళీ పెళ్లి చెడగొడుతున్నావని ఈ సారి మా అత్త ఇంట్లో నుండి నిన్ను గెంటేస్తుంది.
ఒకవేళ పెళ్లి ఆపడానికి జ్యోత్స్న ఏమైనా చేస్తుంది అత్తకి మామయ్య కి తాతకి ఏదైనా ప్రమాదం తీసుకొని రావచ్చు లేక గౌతమ్ ఫ్యామిలీకి ఏదైనా చెయ్యొచ్చు కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలని దీపకి కార్తీక్ చెప్తాడు. మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న కలిసి
కాశీని కలుస్తారు. నీకు పది లక్షలు హెల్ప్ చేస్తాను. నాకు ఒక హెల్ప్ చేయాలి.. గౌతమ్ మంచివాడో కాదో కనుకోమ్మని జ్యోత్స్న ఆఫర్ ఇస్తుంది. దానికి ముందు కాశీ ఒప్పుకోడు పారిజాతం చెప్పగానే సరే అంటాడు. ఈసారి పెళ్లి దీప కాదు కాశీ చెడగొడతాడని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. మరికొవైపు గౌతమ్ ని కలుస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళగానే గౌతమ్ వెళ్తాడు.
అసలు జ్యోత్స్నకి నాతో పెళ్లి ఇష్టమేనా.. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని శివన్నారాయణతో గౌతమ్ అంటాడు గౌతమ్ కి సపోర్ట్ గా కార్తీక్ మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఇంట్లోకి వస్తారు. జ్యోత్స్న రాగానే గౌతమ్ సైలెంట్ గా వెళ్లిపోతాడు. నీ వల్ల గౌతమ్ కి కోపం వచ్చింది. అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడం లేదట.. నువ్వు తన దగ్గరికి వెళ్లి సారీ చెప్పమని జ్యోత్స్న పై కోప్పడుతాడు దశరథ్. బావ నన్ను ఇలా ఇరికించావా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.