English | Telugu
Brahmamudi: రాజ్ చెప్పినవి విని షాకైన సిద్దార్థ్.. కావ్య హ్యాపీ!
Updated : Jul 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -767 లో..... రాజ్ ఆఫీస్ కి వెళ్లి ఎంప్లాయిస్ అందరిని పిలిచి.. మీరు వర్క్ సరిగా చెయ్యడం లేదని కోప్పడతాడు. ఇప్పుడే మీ అందరిని ఉద్యోగం నుండి తీసేస్తున్నానని రాజ్ అనగానే అందరు టెన్షన్ పడతారు. అప్పుడే కావ్య ఎంట్రీ ఇచ్చి.. సూపర్ బాస్.. ఫ్రాంక్ చాలా బాగుందని అంటుంది. ఇదంతా సర్ ఫ్రాంక్ చేశారు.. మీరు అందరు వెళ్ళండి అని కావ్య అనగానే అందరు వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నారు బాస్ లాగా నటించమంటే ఎందుకిలా చేస్తున్నారని రాజ్ పై కావ్య కోప్పడుతుంది.
ఆ తర్వాత ఇద్దరు సరదాగా కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటారు. మరొకవైపు రాహుల్ ని తీసుకొని వచ్చి రుద్రాణి కాళ్ళపై పడేస్తుంది స్వప్న. ఏం చేసాడని అలా చేస్తున్నావని రుద్రాణి అనగానే.. రాహుల్ చేసిన పని గురించి స్వప్న చెప్తుంది. నువ్వు చెప్పింది ఇప్పుడు మేమ్ నమ్మాలా అని రుద్రాణి అనగానే రాహుల్ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని వస్తుంది అప్పు. రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానని నగలు ఇచ్చాడని తను చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత రాహుల్ ని అందరు తిడతారుమ ఇకనుండి ఈ ఇంట్లో వాడికి ఎవరు డబ్బు ఇవ్వనవసరం లేదు.. ఇంట్లో పనులు చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. ఎందుకురా ఇలా తప్పు మీద తప్పు చేస్తునే ఉంటావని రాహుల్ పై కోప్పడుతుంది రుద్రాణి.
ఆ తర్వాత యామినికి రాజ్ ఫోన్ చేసి.. ఈ రోజు నేను ఇంటికి రావడం లేదు. ఇక్కడ కళావతి దగ్గర ఉంటున్నానని చెప్పగానే.. యామినికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ వచ్చి రాజ్ తో మాట్లాడతారు. ఈ రోజు ఎలాగైనా కళావతి గారికి ప్రపోజ్ చెయ్యాలని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్ ని ఎండీగా తొలగించాలని అనుకుంటున్నాను.. ఇప్పటివరకు జరిగిన డీలింగ్స్ గురించి చెప్పు అని రాజ్ ని మీటింగ్ లో అడుగుతాడు సిద్దార్థ్. రాజ్ అన్ని చెప్తుంటే సిద్దార్థ్ షాక్ అవుతాడు. అప్పుడే కావ్య వచ్చి ఇవన్నీ ఎలా తెలుసు.. గతం గుర్తుకు వచ్చిందా అని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.