English | Telugu
Illu illalu pillalu : రామరాజు ఇంటికి భాగ్యం... నర్మదకి వార్నింగ్!
Updated : Jul 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -204 లో.....సాగర్ నర్మద బయట కూర్చొని ఉంటారు. సాగర్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతుంటే శ్రీవల్లి చూసి రామరాజు కి పట్టించాలని అనుకుంటుంది. దాంతో అర్ధరాత్రి దొంగ దొంగ అంటూ అరుస్తుంది. అందరు బయటకి వస్తారు. దొంగ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడే చదువుకుంటున్న సాగర్ ని రామరాజు చూస్తాడు. రామరాజుని చూసి సాగర్ షాక్ అవుతాడు.
ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. చేతిలో ఆ బుక్ ఏంటి మావయ్య గారు అని శ్రీవల్లి అనగానే అవును అదేంటని రామరాజు అడుగుతాడు. నేను చదువుకుంటున్నానని నర్మద కవర్ చేస్తుంది. అయిన బుక్ నీ చేతిలో లేదు కదా అని శ్రీవల్లి అనగానే సాగర్ నాకూ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాడని నర్మద కవర్ చేస్తుంది. మరుసటిరోజు నర్మద, ప్రేమలకి ఓ విషయం అర్థమవుతుంది. శ్రీవల్లి రాత్రి కావాలనే రామరాజు పిలిచిన విషయం అర్ధమవుతుంది. దాంతో బల్లి అక్క బల్లి అక్క అంటూ శ్రీవల్లి ని అట పట్టిస్తారు. ఆ తర్వాత వేదవతి హారతి ఇస్తుంటే దీపం ఆరిపోతుంది. అప్పుడే నర్మద ప్రేమ వచ్చి అలా దీపం ఆరిపోతే ఏం కాదని చెప్పి మాట్లాడతారు. దాంతో వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఎప్పుడు కోడళ్ళలా కాకుండా ఫ్రెండ్స్ లా ఉండాలని వేదవతి తన ఇద్దరి కోడళ్ళతో అంటుంది. అదంతా శ్రీవల్లి చూసి కుళ్ళుకుంటుంది.
ఆ తర్వాత శ్రీవల్లి పేరెంట్స్ రామరాజు దగ్గరికి వస్తారు తొలిఏకాదశి కదా మీకు బట్టలు పెట్టాలని వచ్చానని రామరాజుతో భాగ్యం అంటుంది. నర్మద, ప్రేమలని అవమానించడానికి భాగ్యం ట్రై చేస్తూ ఉంటుంది. తరువాయి భాగంలో నా కూతురు జోలికి వస్తే బాగుండదని నర్మదకి వార్నింగ్ ఇస్తుంది భాగ్యం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.