English | Telugu
Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి సాయం చేసింది ఎవరు?
Updated : Aug 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -179 లో..... రామలక్ష్మిని సీతాకాంత్ ప్రేమ గా చూస్తాడు. ఇంకా మేడమ్ రాలేదు ఏంటని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగుగా...మేడమ్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు సుజాత, పింకీలు బర్త్ డే పార్టీ కీ వస్తారు. సుజాత భయపడుతు పింకీ వెళ్ళిపోదామని అంటుంది.
అ తర్వాత సుజాత వాళ్ళని రామలక్ష్మి చూసి.. ఎప్పుడు వచ్చారు అమ్మ అంటు అడుగుతుంది. నాన్న రాలేదా అని అడుగగా.. తాగి పడుకున్నాడంటూ పింకీ చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి అక్కడ నుండి మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోతుంది. మరొక వైపు నందిని ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో సందీప్ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే శ్రీవల్లి, శ్రీలత ఇద్దరు వస్తారు. సందీప్, శ్రీలతలకి కోపం వచ్చేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. అ తర్వాత శ్రీలత శ్రీవల్లిలు వస్తుంటే.. సుజాత, పింకీలు పార్టీ లో స్వీట్ తింటుంటారు. వాళ్ళను చూసి వీళ్ళని బాధపెడితే రామలక్ష్మి బాధపడుతుందని శ్రీవల్లితో శ్రీలత అనగానే.. నాకు అర్థమైందంటూ పింకి దగ్గరకి శ్రీవల్లి వెళ్తుంది. ఫ్రీగా వచ్చాయి కదా అని తింటున్నారంటూ అవమానిస్తుంది. మిమ్మల్ని ఎవరు పిలిచారు మీ అక్క, అన్నలు వచ్చి ఇక్కడే ఉన్నట్లే.. నువ్వు ఉందామని అనుకుంటున్నావా అని పింకీని శ్రీవల్లి తిడుతుంటే.. మేమ్ వెళ్ళిపోతాం కానీ అలా మాట్లాడకండి అని సుజాత అంటుంది.
అ తర్వాత సుజాత పింకీలు వెళ్లిపోతుంటే రామలక్ష్మి వచ్చి ఆపుతుంది. మా వాళ్లు నేను పిలిస్తే వచ్చారు. ఎందుకు ఇలా అవమానిస్తున్నారని వాళ్ళపై రామలక్ష్మి కోప్పడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లనవసరం లేదు. ఇది నీ కూతురు ఇళ్లు అని చెప్తుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఎప్పుడు వచ్చారంటూ సుజాత వాళ్ళని అడుగుతాడు. పార్టీ ని బాగా ఎంజాయ్ చెయ్ ఎవరైనా ఏదైనా అంటే నాకు చెప్పమని పింకీతో సీతాకాంత్ చెప్తాడు. అ తర్వాత ఇంకా నందిని మేడమ్ రావట్లేదని సీతాకాంత్ అడుగుతాడు. సీతాకాంత్ కేక్ కటింగ్ దగ్గరకి వస్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.