English | Telugu
వీడియో చూడండి...చెప్పి మోసం చేసాను!
Updated : Aug 13, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -173 లో.... సీతాకాంత్ దగ్గరకి రామలక్ష్మి వస్తుంది. ఇంకా నిద్రపోతున్నారా అని తన దగ్గర వరకు వెళ్లి పక్కన కూర్చుంటుంది. ప్రేమగా నా మనసుని దొంగిలించి దొరలా నిద్రపోతున్నావా.. అభిమానం ఉందని మాత్రమే చెప్తున్నారు.. ప్రేమ ఉందని చెప్పట్లేదు బాగా అలసిపోయినట్లున్నారు పడుకోండి అని సీతాకాంత్ ని చూస్తూ రామలక్ష్మి అని వెళ్లిపోతుంటే.. తన చీర కొంగుపట్టుకొని సీతాకాంత్ లాగినట్లు అనిపిస్తుంది. వెంటనే మళ్ళీ వెనకాలకి వచ్చి సీతాకాంత్ మొహంలో మొహం పెడుతుంది. అప్పుడే సీతాకాంత్ నిద్ర లేచి నాతో ఏదైనా చెప్పాలా అని అంటాడు.
గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చానని కవర్ చేస్తుంది.. అలా చెప్పకపోతే మీ కోసం వచ్చానని చెప్పొచ్చు కదా అని సీతాకాంత్ అనుకుంటాడు నన్ను అడగకపోతే మీ ప్రేమ విషయం మీరే చెప్పొచ్చు కదా అని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు సేవ్ చేసిన అమ్మాయి నందిని.. తన దగ్గరకి ఒకతను వచ్చి సారీ మేడమ్ కంపెనీ మీకు ఇస్తాను అని చెప్పి మోసం చేసాను.. మీకు ఎదరుతిరిగి భయపడుతున్నా అని అతను రిక్వెస్ట్ చేస్తుంటే.. నాకు నమ్మకద్రోహం చేస్తే నేను వదలనని నందిని అంటుంది. ఆ తర్వాత మనం ఇండియాకి వచ్చి బుద్ది చెప్పాలి అనుకున్నది ఈ చోప్రాకీ.. ఇక మన నెక్స్ట్ బిజినెస్ ఏంటి మేడమ్ అంటూ నందిని పిఏ నందినితో అంటుంది. ఆ తర్వాత బోర్డు మెంబర్ ని సందీప్ ఇంటికి పిలుస్తాడు. నేనే చైర్మన్ కావాలి సపోర్ట్ చెయ్యాలనగానే.. లేదు మీ అన్నయ్య నిర్దోషి అని ఋజువు అయింది కదా అని అతను అంటాడు.. అప్పుడే శ్రీలత వచ్చి మచ్చ అయితే పడింది కదా.. మీరు సందీప్ కీ సపోర్ట్ చేస్తే మీ వాటా మీకు అందుతుందని శ్రీలత అంటుంది దాంతో బోర్డు మెంబర్ సరే అంటాడు.
ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కీ బయలుదేర్తాడు. షేర్ మార్కెట్ లో షేర్స్ అన్ని పడిపోయాయంట బోర్డు మెంబెర్ మీటింగ్ అరెంజ్ చేశారు వెళ్తున్నామని సీతాకాంత్ అంటాడు. నేను వస్తానని రామలక్ష్మి అనగా.. వద్దని సీతాకాంత్ వెళ్తాడు. మీటింగ్ జరుగుతుంది. అందులో అందరూ సందీప్ గారు చైర్మన్ ఉంటేనే బాగుంటుందని చెప్తారు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అవసరం లేదు పక్క వాళ్లు పెట్టె ప్రలోభాలకి తీసుకొని నిర్ణయం తప్పు అవుతుందని రామలక్ష్మి అనగానే.. కంపెనీని పైకి తీసుకొని వచ్చే నిర్ణయం తప్పు ఎలా అవుతుందని బోర్డు మెంబర్ అంటాడు. అయితే ఒక వీడియో చూడండి అని రామలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో నన్ను కాదని కంపెనీ కాపాడుదామని చూస్తున్నావా అని శ్రీలత అనగానే.. నేను కంపెనీని మా అయనని కాపాడుతానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇంత సడెన్ గా నిర్ణయం ఎలా తీసుకుంటారు.. దీని వెనకాల ఎవరో ఉన్నారని సీతాకాంత్ అనగానే.. ఉన్నారు మీ అమ్మ అని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.