English | Telugu

Karthika Deepam2 : శౌర్య ఏడుపుతో కరిగిన దీప.. తప్పనిసరి పరిస్థితుల్లో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -197 లో....పొరపాటుగా కార్తీక్, దీప లు డాష్ ఇచ్చుకుంటారు. అది శౌర్య చూసి కొమ్ములు వస్తాయ్ మళ్ళీ డాష్ ఇచ్చుకోండి అని అంటుంది. పదంతో మళ్ళీ డాష్ ఇచ్చుకుంటారు. దీప వెళ్ళిపోతుంది. ఫోన్ తర్వాత ఇస్తా నాన్న అని చెప్పగానే కాసేపు ఫోన్ చూసి తీసుకొని రా అని కార్తీక్ వెళ్లిపోతాడు. కార్తీక్, దీప లు పక్క పక్కన ఉన్నప్పుడు ఫోటో తీస్తుంది శౌర్య. అది అనసూయకి చూపిస్తుంది కాంచన. అప్పుడే దీప వచ్చి ఫోన్ పట్టుకొని నువ్వు చేస్తుంది ఇదా అంటూ కోప్పడుతుంది.


ఆ తర్వాత స్వప్న వంట చేస్తుంటే కాశీ వచ్చి రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటారు. అసలు అక్క ఇంకా ఒప్పుకోలేదని కాశీ అనగానే వదినని ఒప్పించే బాధ్యత మీ నలుగురికి అప్పగించాను. శౌర్య అసలు వదలదని స్వప్న అంటుంది. అత్తయ్యకి ఫోన్ చెయ్ వస్తున్నారో లేదో అనగానే.. కావేరికి ఫోన్ చేస్తుంది స్వప్న. మీరు లిఫ్ట్ చెయ్యండి అని శ్రీధర్ కి చెప్తుంది కావేరి. శ్రీధర్ వాయిస్ విన్న స్వప్న ఫొన్ ని కాశీకి ఇస్తుంది. కాశీ వాయిస్ విని శ్రీధర్ కావేరికి ఇస్తాడు అత్తయ్య గారు వస్తున్నారా అని కాశీ అడుగుతాడు. అల్లుడు గారు వస్తున్నానంటూ మాట్లాడుతుంటే శ్రీధర్ చిరాకు పడతాడు. నేను వస్తానని చెప్పలేదని శ్రీధర్ అనగానే నేను మాటిచ్చానని కావేరి అంటుంది. అక్కడ జరిగేది న్యూస్ వాళ్లకి తెలిస్తే ఏం రాస్తారో తెలుసా..రెండో పెళ్ళి ఆవిడని పెళ్లి చేసుకున్న కొడుకు.. రెండో పెళ్లి చేసుకున్న తండ్రి అని రాస్తారని శ్రీధర్ అంటాడు. ఇదంతా జరగడనికి కారణం దీప నా కూతురు పెళ్లి చెయ్యడం.. దీపపై పగ తీర్చుకోవడానికి అయిన వస్తానని శ్రీధర్ అనుకుంటాడు.

ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. శౌర్య ఎక్కడా అని అడుగుతారు. అనసూయ వెళ్లి చూసేసరికి శౌర్య ఉండదు. దాంతో అందరు శౌర్య గురించి ఇంట్లో వెతుకుతారు. ఒక పక్కన కూర్చొని శౌర్య ఏడుస్తుంది. నాకు అమ్మనాన్న వద్దు.. ఇలా ఉండాలి అనుకున్న అని ఒక స్కెచ్ ఆర్ట్ చూపిస్తుంది. అందులో అమ్మనాన్న పాప ఉంటుంది కానీ మీరు ఇలా లేరు.. నేను వెళ్ళిపోతాను మా అమ్మకి నేను ఇష్టం లేనని శౌర్య ఏడుస్తుంది. ఇష్టం ఉంటే ఎందుకు రిసెప్షన్ కి ఒప్పుకోవడం లేదని ఏడుస్తుంటే.. ఇక దీప తప్పనిసరి పరిస్థితి లో ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.