English | Telugu
శ్యామల భర్త నరసింహతో ఫొటో షేర్ చేసిన ప్రేమి! 'కార్తీకదీపం'లో దుర్గ రి-ఎంట్రీ!!
Updated : Aug 20, 2021
అభిమానులను ఎలా ఆనందింపజేయాలో, వారి సంఖ్యను ఎలా పెంచుకోవాలో 'కార్తీకదీపం' ఫేమ్ ప్రేమి విశ్వనాథ్‌కు బాగా తెలిసిపోయినట్లుంది. అందుకే ఆ సీరియల్‌కు సంబంధించిన రెగ్యులర్ అప్‌డేట్స్‌తో వారిని ఆకట్టుకుంటూ వస్తోంది వంటలక్క. అంతేకాదు, తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా అప్పుడప్పుడు ఆమె షేర్ చేస్తోంది.
రీసెంట్‌గా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన సహనటులు నరసింహ, భరద్వాజ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ ఇద్దరూ 'కార్తీకదీపం'లో దుర్గ, అంజి పాత్రల్ని చేస్తున్నారు. ఆ సీరియల్ లొకేషన్‌కు నరసింహ (యాంకర్ శ్యామల భర్త) రావడం, అతనితో ప్రేమి ఫొటో దిగడంతో దుర్గ క్యారెక్టర్ రి-ఎంట్రీ ఇస్తుందని అర్థమైపోయింది. ఈ ఫొటోల్లో ప్రేమి నవ్వులు చిందిస్తోంది. నరసింహతో చేతులు కలుపుతున్న ఫొటో ఒకటి అయితే, ఆ ఇద్దరి మధ్యలో నిల్చొని వాళ్ల చేతుల్ని తన చేతుల్లోని తీసుకున్న ఫొటో ఇంకొకొటి.
ప్రస్తుతం సీరియల్‌లో మోనిత మిస్సింగ్ కేస్ నడుస్తోంది. ఆమెను కార్తీక్ హత్య చేశాడని అనుమానిస్తూ డీసీపీ రోషిణి అతడిని పోలీస్ స్టేషన్‌లో పెట్టగా, దీపను హత్య చేయడానికి మోనిక పథకం వేయడం చూస్తున్నాం. మోనితను ఎవరో మర్డర్ చేసి ఉండారనీ, ఆ నేరం కార్తీక్ మీదకు వచ్చిందనీ దీపతో అంజి చెప్పడంతో, ఆ పనిచేసింది దుర్గ అని అనుకుంటుంది దీప.
దీంతో రానున్న ఎపిసోడ్స్‌లో దుర్గ క్యారెక్టర్ కీలకం కానున్నదని ఊహించవచ్చు. మోనితకు ప్రబల శత్రువైన దుర్గ.. దీపకు న్యాయం జరగాలని అనుకుంటుంటాడు. కాబట్టి.. దీపకు హెల్ప్ చేయడానికి అతను తప్పకుండా వస్తాడన్న మాటే.