English | Telugu
'బిగ్ బాస్ ఓటీటీ'లో జరుగుతున్నది ఇదీ.. స్విమ్మింగ్ పూల్‌లో చిల్!
Updated : Aug 20, 2021
ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌పై సెన్సార్‌షిప్ లేకపోవడంతో అక్కడ రిలీజవుతున్న సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో శృంగారం, హింస, బూతు మితిమీరుతున్నాయనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. లేటెస్ట్‌గా 'బిగ్ బాస్ ఓటీటీ' షో కూడా బోల్డ్ డోస్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'బీబీ ఓటీటీ' వీక్షకుల్ని రంజింప చేస్తోందనడంలో సందేహం లేదు. కొంతమంది కంటెస్టెంట్లు బోల్డ్‌గా కనిపించడానికి వెనుకాడ్డం లేదు. తాజాగా కంటెస్టెంట్లు స్విమ్మింగ్ పూల్‌లో ఈతలు కొడుతూ, ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ కనిపించారు. ఇంట్లో పనుల విషయంలో ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసుకుంటూ వస్తున్న వాళ్లు ఇలా చిల్ అవుతూ కనిపించడం వీక్షకుల్ని అట్రాక్ట్ చేసింది.
నేహా భాసిన్, మిళింద్ గాబా, నిశాంత్ భట్, జీషన్ ఖాన్ పూల్‌లో బాగా ఎంజాయ్ చేశారు. మొదట డ్రస్‌తోటే నీళ్లలోకి దూకిన నేహ, తర్వాత స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌లోకి మారింది. మిళింద్, నిశాంత్ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్నారు. చిన్నపిల్లల మాదిరిగా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
రిధిమా పంటిట్‌ను కూడా తమతో జాయిన్ అవ్వాల్సిందిగా నేహ పిలిచినా, అప్పటికే ఆమె డ్రస్ వేసుకొని ఉండటంతో ఆమె పూల్‌లోకి దిగలేదు. అయితే పూల్ బయట నిల్చొనే వారిని ఎంకరేజ్ చేసింది. కొంతసేపటికి కరణ్ నాథ్ కూడా పూల్‌లో ఉన్నవాళ్లతో కలిశాడు. ఐదుగురూ కొంతసేపు పూల్‌లో ఎంజాయ్ చేసి, తర్వాత బయటకు వచ్చి ఫ్రెష్ అయ్యారు. ఇలాంటి సీన్లతో వ్యూయర్స్ దృష్టిని 'బీబీ ఓటీటీ' అలరిస్తోంది.