English | Telugu

గుడికి రాని దీప హ‌త్య‌కు ప్లాన్ మార్చిన‌ మోనిత!

భాగ్యం, ఆమె భర్త మురళీకృష్ణ గుడికి వెళుతూ దీపను రమ్మని చెబితే... దీప గుడికి వెళ్తే ఆమెను అక్కడే చంపాలని గన్ తీసుకుని మోనిత బయలుదేరిన సంగతి తెలిసిందే. దీప గుడికి రాకపోవడంతో మోనితకు నిరాశ తప్పలేదు. అయితే, దీపను చంపడానికి మోనిత కొత్త ప్లాన్ వేసింది. మోనిత వలలో దీప చిక్కుతుందా? లేదా? అనేది తదుపరి ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. ఈ రోజు (ఆగస్టు 20, 1123) ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...

భాగ్యం, మురళీకృష్ణ గుడికి వెళతారు. వాళ్లిద్దరూ పూజారితో మాట్లాడుతుండగా, అక్కడికి మోనిత చేరుకుంటుంది. దీప కనిపించడకపోవడంతో ఎక్కడ ఉందోనని అటూ ఇటూ చూస్తుంది. వాళ్ళ మాటలు వింటే ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని పూజారి, భాగ్యం, మురళీకృష్ణ దగ్గరకు వెళుతుంది. సరిగా అప్పుడే 'పూజారిగారు, దీపకు ఏదో పని ఉండి ఈరోజు రాలేదు' అని భాగ్యం చెప్పిన మాటలు మోనిత చెవిన పడతాయి. ఆయన మర్నాడు సాయంత్రం వస్తే... అఖండ జ్యోతి వెలిగించి పంపిస్తానని చెబుతారు. దీప చావు ముహూర్తం రేపటి వాయిదా పడిందని మోనిత మనసులో అనుకుంటుంది.

గుడి నుండి బయటకు వస్తున్న భాగ్యం, మురళీకృష్ణ ముందు 'సోది చెబుతానమ్మా సోది చెబుతా' అంటూ మోనిత తిరుగుతుంది. సోది చెప్పించుకోవడానికి మోనిత దగ్గరకు భాగ్యం వెళుతుంది. 'కడుపునా పుట్టకపోయిన పెద్దకూతురు కష్టం కోసం గుడికి వచ్చావే తల్లి. ఆ పెట్ట కష్టాల్లో ఉంది. పెట్టకు చెందిన పుంజు కొలువులో ఉన్నాడు' అని చెబుతుంది. పరిష్కారం చెబుతానంటూ 'రేపు ఆరున్నరకు బస్తీలో గుడికి పెట్టను ఒంటరిగా రమ్మను. ఓ మంత్రం చెబుతా. దాంతో పుంజు బయటకు వస్తుంది. నా మాట కాదని పెట్టతో పాటు ఎవరొచ్చినా మంత్రం పని చెయ్యదు' అని చెబుతుంది. తప్పకుండా పంపిస్తానని చెప్పిన భాగ్యం అక్కడ నుండి బయలుదేరుతుంది. వెళ్లేముందు మోనిత చేతిలో భాగ్యం, మురళీకృష్ణ దంపతులు ఓ వంద రూపాయలు పెడతారు.

దీప బ‌స్తీలో గుడికి ఒంట‌రిగా వస్తే చంపేయాలని మోనిత ప్లాన్. భాగ్యం, మురళీకృష్ణ వెళ్లిన తర్వాత అప్పటివరకూ ముఖానికి అడ్డుగా పెట్టుకున్న చీర కొంగును తొలగించి... 'రా దీప. రా! రేపు నిన్ను చంపి, ఈ వందతో పూలదండ కొని నీ మెడలో వేస్తా' అని ఆవేశంతో మోనిత రగిలిపోతుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.