English | Telugu

మోనిత‌ మర్డర్‌కు, కార్తీక్ అరెస్టుకు అత్తగారే సాక్షి!

'కార్తీక దీపం' సీరియల్ ట్విస్టులు అభిమానులను నరాలు తెగే ఉత్కంఠలో పడేస్తున్నాయి. ఊహకు అందని మలుపులతో రోజు రోజుకూ సీరియల్ రసవత్తరంగా మారుతోంది. హిమ మరణానికి మోనిత కారణం అని తెలిసిన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, ఆమె ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. మోనితను చంపేస్తానని ఆగ్రహావేశాలకు లోనవుతాడు.

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో 'నువ్వు బతకడానికి వీల్లేదు' అంటూ మోనితకు గురి పెడతాడు కార్తీక్. "ఇన్ని దారుణాలు చేసిన నాకు నీ భార్య దీపను, మీ అమ్మను తప్పించడం ఓ లెక్కా?" అని మోనిత అనేసరికి కోపంతో కార్తీక్ గట్టిగా అరుస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి దీపతో తన జీవితం ఇలా అయిపోవడానికి తనవాళ్ళే కారణమని ఆవేదన చెందుతాడు. కన్నీరు పెట్టుకుంటాడు. అసలు ట్విస్ట్ ఆ తర్వాత, బుధవారం ఎపిసోడ్ లో ఇచ్చాడు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర.

కార్తీక్ ఇంటికి వచ్చిన ఏసీపీ రోషిణి 'నీ భర్త నీకు తెలియకుండా మోనితను చంపి, ఆ శవాన్ని మాయం చేశాడు' అని దీపతో చెబుతుంది. కారు డిక్కీలో రక్తపు మరకలు ఉన్నాయని చెబుతుంది. సాక్ష్యంగా దీప పిన్ని భాగ్యాన్ని చూపిస్తుంది. తనను కిడ్నాప్ చేయడానికి వచ్చిన భాగ్యాన్ని బురిడీ కొట్టించిన మోనిత, ఆమెను బందీగా చేసి తన ఇంట్లో ఉంచిన సంగతి తెలిసిందే. కార్తీక్ షూట్ చేసినప్పుడు బుల్లెట్ సౌండ్ భాగ్యం వింటుంది. అదే రోషిణితో చెప్పడంతో కార్తీక్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళుతుంది. అలాగే, తాను మోనిత ఇంటికి వెళ్లిన దగ్గరనుంచి జరిగిందంతా చెబుతుంది.

ఇవాళ్టి ఎపిసోడ్ లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే... 'మోనిత కడుపులో బిడ్డకు నేను ఎలా తండ్రిని అయ్యానో, ఈ హత్యకు కూడా అలాగే కార‌ణం అయ్యాను' అని దీపతో కార్తీక్ చెబుతాడు. దాంతో అతడు ఈ హత్య చేయలేదని అర్థమవుతుంది. మరి, ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే మోనిత కనిపించడం లేదు కనుక అనుకోవాలి.

మోనిత ఇంట్లో కార్తీక్ రెండు బుల్లెట్స్ కాల్చాడు. ఒకటి పోలీసులకు దొరికింది. మరొకటి దొరకలేదు. అదే మోనిత మరణానికి కారణం అయ్యి ఉంటుందని, ఆమె శవాన్ని కార్తీక్ మాయం చేశాడని అనుమానిస్తున్నారు. కార్తీక్ అరెస్టుతో తండ్రి ఆనందరావు, భార్య దీప, పిల్లలు శౌర్య, హిమ, తమ్ముడు ఆదిత్య అందరూ దుఃఖంలో మునిగిపోతారు.

మోనితను కార్తీక్ షూట్ చెయ్యకపోతే, మోనిత ఏమైనట్టు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నట్టు? అనేది తదుపరి ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే టాపిక్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.