English | Telugu
మోనాల్‌ను పక్కా షూట్ చేస్తానన్న ముమైత్‌ఖాన్!
Updated : Aug 11, 2021
బుల్లితెర మీదకు ముమైత్ ఖాన్ మళ్లీ వచ్చింది. 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఆమె ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఇప్పుడు సినిమాల్లో కంటే టీవీల్లో ఎక్కువ కనిపిస్తోంది. బిగ్ బాస్, డాన్స్ ప్లస్ షోస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ 'సిక్స్త్ సెన్స్' షోలో గెస్ట్ కింద సందడి చేయనుంది. లాస్ట్ బిగ్ బాస్ సెన్సేషన్ మోనాల్ గజ్జర్, ముమైత్ ఖాన్ ఒక ఎపిసోడ్‌లో కనిపించనున్నారు.
'సిక్స్త్ సెన్స్' షోకు వచ్చినవాళ్ల చేతిలో గన్స్ పెట్టడం ఓంకార్ అలవాటు. ఆ తర్వాత షూట్ చేయమని అడుగుతాడు. అలాగే, ముమైత్ ను అడిగాడు. ఓంకార్ గుండెలకు ముమైత్ గురి పెట్టింది. 'అక్కడ నువ్వు ఉన్నావ్' అని అతడు అనేసరికి గుండెల పక్కకి గురి పెట్టింది. 'అక్కడ మోనాల్ ఉంది' అన్నాడు. వెంటనే పక్కా కాలుస్తా అన్నట్టు చెప్పింది. 'మోనాల్ ను కాలుస్తావా?' అన్నాడు. దాంతో ఒక్కటే నవ్వులు.
ఈ వీకెండ్ 'సిక్స్త్ సెన్స్' మరో ఎపిసోడ్‌లో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీతో వచ్చాడు. టీవీ స్టార్ ప్రభాకర్ ఫ్యామిలీ కూడా అదే ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. రెండు ఫ్యామిలీలు కలిసి ఫన్ ఇవ్వడం పక్కా అనుకుంట. విచిత్రం ఏమిటంటే... అమ్మ రాజశేఖర్ కు ఓ కుమారుడు, కుమార్తె. ప్రభాకర్ కు కూడా అంతే... ఓ అమ్మాయి, అబ్బాయి. అదే విషయం ఓంకార్ చెప్పాడు. వెంటనే ప్రభాకర్ వైఫ్ "అక్కడ భార్యాభర్తలు, ఇక్కడ భార్యాభర్తలు" అని జోక్ వేసి నవ్వించే ప్రయత్నం చేశారు. అదేమంత పేలలేదు. కానీ, అమ్మ రాజశేఖర్ కుమార్తెతో కలిసి ప్రభాకర్ కుమార్తె 'మైండ్ బ్లాక్... మైండ్ బ్లాక్... బాబు నీ మాస్ లుక్కు మైండ్ బ్లాక్' పాటకు స్టెప్పులు వేశారు. అలాగే, ఫ్యామిలీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.