English | Telugu
దారినపోయే దానయ్యతో రష్మీ సెల్ఫీ... ఆడియన్స్‌కు మెసేజ్!
Updated : Aug 10, 2021
స్టార్లు, సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడానికి సామాన్య ప్రజలు చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఒకవేళ ఎప్పుడైనా రోడ్డు ఏదైనా వాహనంలో స్టార్ కనిపిస్తే, దానిని వెంబడిస్తారు. అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి స్టార్లు సదా సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏమీ అనరు.
ఓ స్టార్ తనకు తానుగా సామాన్యులతో సెల్ఫీలు దిగడం అరుదు. అటువంటి అరుదైన పని చేసింది రష్మీ గౌతమ్. ఎవరో దారిన పోయే దానయ్యతో సెల్ఫీ తీసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆడియన్స్‌కు మెసేజ్ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటనేది తెలుసుకోవడానికి వివరాల్లోకి వెళితే...
రష్మీ గౌతమ్ పని మీద కారులో వెళ్తున్నారు. రోడ్డు మీద ఎవరో బండి వేసుకుని, హెల్మెట్ లేకుండా మగమహారాజులా దర్జాగా వెళ్తున్నాడు. కారులో కూర్చున్న రష్మీ గౌతమ్, అతడు కనిపించేలా సెల్ఫీ తీసుకున్నారు. "హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో సెల్ఫీ. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి" అని పోస్ట్ చేశారు.
రష్మీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అని చెప్పాలి. మూగజీవాలకు ఆహారం పెట్టడం నుండి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆర్థిక సహాయం చేయడం వరకు పలు మంచి పనులు చేస్తుంటుంది.